
చాలా మంది హీరో, హీరోయిన్లు తమ రెమ్యునరేషన్‌ను వివిధ వెంచర్లలో పెట్టుబడి పెడుతుంటారు. కొంతమంది నటులు, నటీమణులు తమ సొంత బ్రాండ్‌లను కూడా తెరిచారు. చాలా సినిమా నిర్మాణ సంస్థలు కూడా మొదలయ్యాయి. కొందరు సినిమా థియేటర్లను స్వయంగా నిర్మించారు. మరికొందరు కొందరు హోటళ్లు ప్రారంభించగా, ఇంకొందరు రియల్ ఎస్టేట్‌లో, క్రీడల్లో పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా కొత్త వెంచర్‌లో పెట్టుబడులు పెట్టింది. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి స్టార్ నటులు, నటీమణులు క్రీడల్లో పెట్టుబడులు పెట్టడం బాగా పెరిగింది. షారుక్ ఖాన్, జూహీ చావ్లా కేకేఆర్ టీమ్‌లో, ప్రీతి జింటా పంజాబ్ టీమ్‌లో, శిల్పాశెట్టి రాజస్థాన్ టీమ్‌లో పెట్టుబడులు పెట్టారు. ఆ విధంగా కబడ్డీ జట్టులో అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యరాయ్ పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ టెన్నిస్ జట్టును కొనుగోలు చేసింది. ఐపీఎల్, ఫుట్‌బాల్ లీగ్, కబడ్డీ లీగ్ తరహాలో టెన్నిస్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్న హైదరాబాద్ జట్టులో రకుల్ ప్రీత్ సింగ్ పెట్టుబడులు పెట్టింది. హైదరాబాద్ స్ట్రైకర్స్ టీమ్‌మేట్ రకుల్ ప్రీత్ సింగ్, నవీన్ దాల్మియా, రాజ్‌దీప్ దాల్మియా, నికుంజ్ షా ఈ జట్టుకు ఇతర యజమానులు. హైదరాబాద్ స్ట్రైకర్స్ జట్టు ఇప్పటికే రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు యాజమాన్యం మారిన తర్వాత జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి.
‘దేశంలోని ప్రతిభావంతులైన టెన్నిస్ క్రీడాకారులు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి, క్రీడల్లో పెద్ద పేరు సంపాదించడానికి టెన్నిస్ ప్రీమియర్ లీగ్ మంచి వేదిక. భారత టెన్నిస్‌కు హైదరాబాద్ ఎప్పటి నుంచో పేరుగాంచింది. హైదరాబాద్ స్ట్రైకర్స్‌తో ఆ ఖ్యాతిని మరింత పెంచాలనుకుంటున్నాం’ అని ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తోన్నఇండియన్ 2 సినిమాలో నటిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దీంతో పాటు హిందీలో ‘మేరి పట్టి కా రీమేక్’, ‘ఐ లవ్ యు’, అనే సినిమాల్లో కనిపించనుంది. అలాగే తమిళంలో అయలన్ అనే ప్రాజెక్టుకు ఓకే చెప్పింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.