పెళ్లి చేసుకోవడం వల్ల ఆ సూపర్ హిట్ సినిమా మిస్ అయ్యింది.. చాలా బాధపడ్డానన్న హీరోయిన్ రాశి

టాలీవుడ్ సినీప్రియులకు హీరోయిన్ రాశి సుపరిచితమే. చైల్డ్ ఆర్టిస్టుగా అరంగేట్రం చేసి ఆ తర్వాత కథానాయికగా మారింది. అప్పట్లో బ్యా్క్ టూ బ్యాక్ సినిమాలతో అలరించింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ భాషలలో నటించి మెప్పించింది. శుభాకాంక్షలు, పెళ్లి పందిరి, గోకులంలో సీత వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది

పెళ్లి చేసుకోవడం వల్ల ఆ సూపర్ హిట్ సినిమా మిస్ అయ్యింది.. చాలా బాధపడ్డానన్న హీరోయిన్ రాశి
Raasi

Updated on: Jan 17, 2026 | 8:44 AM

నటి రాశి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. ఒకప్పుడు హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించారు రాశి. ప్రస్తుతం సహాయక పాత్రలు చేస్తూ అలరిస్తున్నారు రాశి.. అలాగే పలు సీరియల్స్ లోనూ నటించి ఆకట్టుకుంటున్నారు ఈ అందాల తార. ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించిన రాశి .. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. అప్పట్లో సినిమా సెట్స్ కు వెళ్ళేటప్పుడు ఒక పాఠశాలకు వెళ్తున్నట్టు ఉండేది అని రాశీ అన్నారు. పొద్దున లేవడం, మేకప్ వేసుకోవడం, షాట్ చేయడం, సాయంత్రం అలసిపోయి ఇంటికి రావడం ఆ రోజులు బాగుండేవి అని అన్నారు. సినిమా సక్సెస్ ల గురించి పెద్దగా తెలియదని.. గోకులంలో సీత పెద్ద హిట్ అయినప్పుడు, అది ఎంతటి విజయమో తనకు తెలియదని, ఎవరో చెబితేనే తెలిసిందని పేర్కొన్నారు. గోకులంలో సీత, పెళ్లి పందిరి, శుభాకాంక్షలు, ప్రేయసి రావే, పండగ, గిల్లికజ్జాలు, స్నేహితులు, మనసిచ్చి చూడు వంటి వరుస విజయాలను చూసి తన తండ్రి ఎంతో సంతోషించారని రాశి తెలిపారు. ప్రేయసి రావే సినిమా తర్వాత ఆయన మరణించారని, అయితే ఆ సినిమా సాధించిన పెద్ద విజయాన్ని చూసి ఆయన వెళ్ళిపోయారని ఎమోషనల్ అయ్యారు రాశి.

అతనంటే నాకు పిచ్చి.. నా గది నిండా ఆ హీరో ఫొటోలే : ఫోక్ డాన్సర్ నాగ దుర్గ

ప్రస్తుతం కొన్ని చిత్రాలలో హీరోయిన్ పాత్ర కేవలం ఒకటి రెండు పాటలకే పరిమితమవుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. తన కెరీర్‌లో కొన్ని మంచి చిత్రాలను డేట్స్ లేకపోవడం వల్ల కోల్పోయానని రాశి తెలిపారు. తమిళంలో చిరంజీవి నటించిన స్నేహం కోసం (నట్పు కాగ) సినిమాలో సిమ్రాన్ పాత్రను తాను చేయాల్సిందని, కానీ తెలుగులో బిజీగా ఉండటం వల్ల సాధ్యం కాలేదని అన్నారు. ఒకే రోజు నాలుగు సినిమాల షూటింగ్‌లకు అటెండ్ అయ్యే రోజులు కూడా ఉండేవని ఆమె గుర్తు చేసుకున్నారు.

ఆ ముద్దుగుమ్మకు పోటీ లేదు.. స్టార్ హీరోయిన్స్ కూడా ఆవిడనే ఫాలో అయ్యేవారన్న బాలయ్య

అయితే, తనను తీవ్రంగా బాధించిన మిస్సింగ్ ఛాన్స్ ఏదైనా ఉందా అని అడిగినప్పుడు, రాశి అరుంధతి సినిమా గురించి ప్రస్తావించారు. తనకు వివాహం అయిన రెండు-మూడేళ్ల తర్వాత, ఏదో ఒక ఫంక్షన్‌లో పోరాం కృష్ణను కలిసినప్పుడు, అరుంధతి సినిమాలో అప్పుడు నేను కరెక్ట్‌గా ఉండుంటే నాకు అవకాశం వచ్చేదా అంకుల్.?” అని అడిగానని తెలిపారు. అందుకు ఆయన నిన్ను ఎవరో ఎందుకు అంత తొందరగా పెళ్లి చేసుకోమన్నారు? అని సరదాగా బదులిచ్చినట్లు చెప్పారు. ఆ మాట విని తాను చాలా బాధపడ్డానని, ఇలాంటి సినిమా వస్తుందని తెలిసుంటే, నా వివాహాన్ని మరో రెండేళ్లు పోస్ట్‌పోన్ చేసేదాన్ని” అని అన్నారు రాశి. పెళ్లి చేసుకోవడం ఎర్లీగా జరిగింది. అలాంటి పాత్రను మిస్ చేసుకున్నందుకు బాధగా ఉందని అని రాశి అన్నారు.

ఇవి కూడా చదవండి

అతను నా సినిమాలు చూడడు.. కానీ నన్ను ఓ జంతువులా చూస్తాడు.. అసలు విషయం చెప్పిన ఆర్జీవీ

టాలీవుడ్ సినీప్రియులకు హీరోయిన్ రాశి సుపరిచితమే. చైల్డ్ ఆర్టిస్టుగా అరంగేట్రం చేసి ఆ తర్వాత కథానాయికగా మారింది. అప్పట్లో బ్యా్క్ టూ బ్యాక్ సినిమాలతో అలరించింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ భాషలలో నటించి మెప్పించింది. శుభాకాంక్షలు, పెళ్లి పందిరి, గోకులంలో సీత వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..