Actress Pragathi : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగతి. ఈ సారి ఏకంగా బుల్లెట్ నడిపి షాక్ ఇచ్చింది..

సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న నటి ప్రగతి ఇటీవల కాలంలో తరచుగా వార్తల్లో ఉంటున్నారు. అమ్మగా, వదినగా, అక్కగా ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించి

Actress Pragathi : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగతి. ఈ సారి ఏకంగా బుల్లెట్ నడిపి షాక్ ఇచ్చింది..

Updated on: Mar 12, 2021 | 12:01 AM

Actress Pragathi : సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న నటి ప్రగతి ఇటీవల కాలంలో తరచుగా వార్తల్లో ఉంటున్నారు. అమ్మగా, వదినగా, అక్కగా ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న ప్రగతి ఈ మధ్య తన ఫిట్‌నెస్, డ్యాన్స్ స్టెప్పులతో అభిమానులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అద్భుతమైన టాలెంట్ ఉన్న క్యారెక్టర్ యాక్టర్. ఎలాంటి పాత్రనైనా తనదైన శైలిలో నటించి మెప్పిస్తారు. అయితే లాక్‌డౌన్ సమయంలో ఆరోగ్యకరమైన నిర్ణయం తీసుకొన్నారు. హెల్త్, వర్కవుట్లతో దడదడలాడించారు. డ్యాన్సులు చేస్తూ షేర్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి.

తాజాగా మరో వీడియోతో నెటిజన్లకు షాక్ ఇచ్చింది ప్రగతి. ఈ సారి డ్యాన్సులు, ఫిట్నెస్ ఫొటోలతో కాదు ఏకంగా బైక్ నడిపి అందరు అవాక్ అయ్యేలా చేసింది ప్రగతి. బుల్లెట్ నడిపిన ప్రగతి వీడియో సోషల్ మీడియాలోబ్ హల్ చల్ చేస్తోంది. పెద్ద మహిళ తరహాలోనే చీరకట్టులో బుల్లెట్ ఎక్కిన ప్రగతి రయ్ రయ్ మంటూ దూసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sairam Shankar : బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో వస్తున్న యంగ్ హీరో.. కొత్తసినిమాను అనౌన్స్ చేసిన సాయిరాం శంకర్

ప్రేమ నిలుపుకోవడం సులువే.. కానీ ఆ ప్రయాణమే భయంకరం.. పెళ్లి గురించి కామెంట్స్ చేసిన వెటరన్‌ హీరోయిన్..