Poonam Kaur: ఏపీ ఎన్నికల ఫలితాలపై నటి పూనమ్‌ కౌర్‌ రియాక్షన్.. అలా అనేసిందేంటి?

ప్రముఖ నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గతంలో పలు హిట్ సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. అయితే సినిమాయేతర విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోందీ అందాల తార. గతంలో మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్సారీపీకి అనుకూలంగా పూనమ్ షేర్ చేసిన పోస్టులు వైరల్ గా మారాయి.

Poonam Kaur: ఏపీ ఎన్నికల ఫలితాలపై నటి పూనమ్‌ కౌర్‌ రియాక్షన్.. అలా అనేసిందేంటి?
Pawan Kalyan, YS Jagan, Poonam Kaur

Updated on: Jun 06, 2024 | 9:50 AM

ప్రముఖ నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గతంలో పలు హిట్ సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. అయితే సినిమాయేతర విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోందీ అందాల తార. గతంలో మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్సారీపీకి అనుకూలంగా పూనమ్ షేర్ చేసిన పోస్టులు వైరల్ గా మారాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై కూడా పూనమ్ రియాక్ట్ అయ్యింది. అది కూడా ఎవరూ ఊహించని విధంగా. జనసేన అధిపతి పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు గెలుపుపై స్పందించని పూనమ్ కౌర్ వైఎస్సార్ సీపీ నినాదం ‘వై నాట్ 175’ పై సెటైరికల్ ట్వీట్ వేసింది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్టోరీ పోస్ట్‌ షేర్‌ చేసింది. ‘వై నాట్ 175 అనే విషయాన్ని ఏపీ ప్రజలు చాలా సీరియస్‌గా తీసుకున్నట్టున్నారు’ అంటూ పోస్ట్ చేసింది. దీనికి #andhrapradesh అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించింది. పూనమ్ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల గా మారింది. అయితే ఎవరిని ఉద్దేశించి పూనమ్ ఈ కామెంట్లు చేసిందో అర్థం కాక నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు.

కాగా గతంలో పలు సార్లు వైఎస్ జగన్ ను, ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపించింది పూనమ్. కొన్ని రోజుల క్రితం చేనేత కార్మికులకు సీఎం జగన్ అందించిన సాయాన్ని గుర్తు చేస్తూ పూనమ్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట బాగా వైరలైంది. అంతకుముందు కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలను స్మరించుకుంటూ నెట్టింట పలు పోస్ట్ లు షేర్ చేసింది. అయితే ఇప్పుడు ఎవరికీ అంతు పట్టనంతగా వైఎస్సార్ సీపీ ‘వై నాట్ 175’ నినాదంపై సెటైరికల్ పోస్ట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

 

ఏపీ ఎన్నికల ఫలితాలపై పూనమ్ కౌర్ పోస్ట్ ఇదిగో

Actress Poonam Kaur

 

గతంలో పూనమ్ కౌర్ పోస్టులు..

జగన్ పై పూనమ్ కౌర్ ప్రశంసలు..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us