Pooja Hegde: బీచ్ లో చెత్తను క్లీన్ చేసి, మొక్కలు నాటిన బుట్ట బొమ్మ.. వీడియో వైరల్.. అభిమానుల ప్రశంసలు

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఈ మధ్యన పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోలతో భారీ హిట్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు గడ్డు కాలం నడుస్తుందనే చెప్పుకోవచ్చు. ఆ మధ్యన ఒక స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చిందని ప్రచారం సాగినా, అవి రూమర్లుగానే మిగిలిపోయాయి

Pooja Hegde: బీచ్ లో చెత్తను క్లీన్ చేసి, మొక్కలు నాటిన బుట్ట బొమ్మ.. వీడియో వైరల్.. అభిమానుల ప్రశంసలు
Pooja Hegde

Updated on: Jun 01, 2024 | 7:33 PM

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఈ మధ్యన పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోలతో భారీ హిట్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు గడ్డు కాలం నడుస్తుందనే చెప్పుకోవచ్చు. ఆ మధ్యన ఒక స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చిందని ప్రచారం సాగినా, అవి రూమర్లుగానే మిగిలిపోయాయి. ప్రస్తుతానికైతే ఈ అందాల తార చేతిలో ఒకే ఒక్క బాలీవుడ్ సినిమా ఉంది. సినిమాల సంగతి పక్కన పెడితే తన సోషల్ మీడియా పోస్టులతో అభిమానులతో టచ్ లో ఉంటోంది పూజా హెగ్డే. తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోలను అందులో పంచుకుంటూ ఫాలోవర్లను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా ఒక మంచి కార్యక్రమంలో పాల్గొంది బుట్ట బొమ్మ. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముంబయిలోని జుహూ బీచ్‌లో గ్రీన్ అప్ కార్యక్రమం నిర్వహించాడు. ఈ ప్రోగ్రామ్ లో పూజ కూడా హాజరైంది. చెత్తను ఊడ్చడంతో పాటు పచ్చదనం పరిశుభ్రత అంటూ మొక్కలు నాటి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ సందర్భంగా పారిశుధ్య సిబ్బంది, కార్మికులతో కలిసి సరదాగా ఫొటోలు దిగింది బుట్ట బొమ్మ. ప్రస్తుతం బీచ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ కు సంబంధించి పూజా హెగ్డే ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. చాలా మంచి చేస్తున్నారంటూ అభిమానులు, నెటిజన్లు పూజ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బీచ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ లో టాలీవుడ్ బుట్ట బొమ్మ.. వీడియో ఇదిగో..

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం హిందీలో ‘దేవ’ అనే మూవీ చేస్తోంది పూజా హెగ్డే.ఇక తెలుగులో డైరెక్టర్ నందినిరెడ్డి దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతోన్న ఓ క్రేజీ మూవీలోనూ బుట్ట బొమ్మకు ఆఫర్ వచ్చిందని సమాచారం.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.