రాఘవ లారెన్స్.. హారర్ సినిమాలకు పెట్టింది పేరు. నటుడిగా, కొరియోగ్రాఫర్ గా దర్శకుడిగా మల్టీ టాలెంట్ తో దూసుకుపోతున్నాడు లారెస్స్. ఈ మధ్య లారెన్స్ సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చారు. చివరిగా చంద్రముఖి 2లో నటించారు లారెన్స్. ఇక ఇప్పుడు మరోసారి హారర్ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టనున్నాడు. ఇప్పటికే కాంచన సిరీస్ లో మూడు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కాంచన 4తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబందించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాంచన 4 సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ నటిస్తుందని తెలుస్తుంది. అది కూడా దెయ్యం పాత్ర ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?
లారెన్స్ తెలుగులో మాస్, స్టైల్, ముని, డాన్, ముని 2: కాంచన, రెబెల్, ముని 3: గంగ సినిమాలతో మెప్పించాడు. ఇక ఇప్పుడు ముని 4 అంటే కాంచన 4 రెడీ చేస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాడు లారెన్స్. హారర్ కంటెంట్ తో పాటు ఆ సినిమాలో అదిరిపోయే మెసేజ్ కూడా ఇస్తున్నాడు. దాంతో ఇప్పుడు కాంచన 4 ఎలా ఉండబోతుందని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు కాంచన 4లో ఓ స్టార్ హీరోయిన్ నటిస్తుందని తెలుస్తుంది. ఆమె మరెవరో కాదు క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే.
కాంచన 4లో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. అంతే కాదు ఈ సినిమాలో ఆమె దెయ్యంగా భయపెట్టనుందని అంటున్నారు. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. కాగా ఈ మధ్య పూజా నటించిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. తెలుగు, తమిళ్ తో పాటు హిందీలోనూ ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో చిన్న గ్యాప్ తీసుకుంది. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారనుంది. ఈ క్రమంలోనే కాంచన 4లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి