
అలా మొదలైంది సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ నిత్యామీనన్(Nithya Menen). తొలి సినిమాతోనే అందం అభినయం తో ఆకట్టుకున్న ఈ చిన్నది ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. దాదాపు యంగ్ హీరోలందరి సరసన నటించిన ఈ వయ్యారి భామ. ఇక టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ భామ. సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఈ మధ్య కాలంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది ఈ భామ. ఈ ముద్దుగుమ్మ పైన చాలా సందర్భాల్లో రకరకాల వార్తలు వినిపించాయి. నిత్యామీనన్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతుందని కూడా వార్తలు వచ్చాయి. అంతే కాదు ఓ స్టార్ హీరో తనను పెళ్లి చేసుకోవాలని సూచించారని తెలుస్తోంది.
స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిత్యామీనన్ ను పెళ్లి చేసుకోమన్నారని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఈ ఇద్దరు కలిసి ఓకే బంగారం సినిమా.. అలాగే జనతా హోటల్ అనే సినిమాలు చేశారు. తాజాగా పెళ్లి రూమర్ పై నిత్యామీనన్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. కాలు విరగడంతో నేను రెస్ట్ తీసుకుంటున్నా.. అందుకే కథలు వినలేదు. దానికి నేను పెళ్లి చేసుకుంటున్నా అని రూమర్స్ పుట్టించారు. అలాగే దుల్కర్ నాకు మంచి ఫ్రెండ్ నన్ను త్వరగా పెళ్లి చేసుకొని, ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకోమని చెప్తూ ఉంటాడు అంతే.. కానీ నాకు ఇప్పుడు పెళ్లి ఆలోచన లేదు అంటూ చెప్పుకొచ్చింది నిత్యామీనన్. ఇటీవలే ఈ అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.