
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన వ్యక్తిత్వానికి సామాన్యులే కాదు స్టార్ హీరోలు సైతం అభిమానులుగా మారిపోతారు. ఇక పవన్ తో నటించే ఛాన్స్ వస్తే చాలు.. స్టార్ హీరోయిన్స్, నటులు సైతం ఎగిరి గంతేస్తుంటారు. అలా పవన్ కల్యాణ్ తో కలిసి హరి హర వీరమల్లు సినిమాలో కథానాయికగా నటించింది నిధి అగర్వాల్. ఈ సినిమా విజయం సాధించకపోయినా ప్రమోషన్స్ కోసం నిధి కష్టపడిన తీరును చూసి పవన్ కల్యాణ్ కూడా ముగ్దులైపోయారు. బహిరంగంగానే నటి డెడికేషన్ ను మెచ్చుకుంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్న నిధి తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్బంగా ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేసింది.
‘పవన్ కల్యాణ్ ఎంతో మందికి దేవుడితో సమానం. ఆయనంటే అంత క్రేజ్ ఉంది. అలాంటి అభిమానం కొందరికి మాత్రమే సొంతమవుతుంది. ఆయన కూడా అభిమానులను అలానే చూసుకుంటారు. పవన్ సార్ తో కలిసి వర్క్ చేసేటప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను. కలిసిన అందరితో బాగా మాట్లాడతారు. ‘హరిహర వీరమల్లు’కు వర్క్ చేసే సమయంలో చాలా మంది నా దగ్గరకు వచ్చి ‘మీరు మా దేవుడితో వర్క్ చేస్తున్నారు’ అని అనేవారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటారు. దేనికోసమైనా వందశాతం కష్టపడతారు. ఎలాంటి విషయాన్నైనా ధైర్యంగా చెబుతారు. నిజాయతీగా ఉంటారు. అందుకే సినిమాలతో సంబంధం లేకుండా ప్రజలు ఆయన్ని ఇష్టపడతారు. భవిష్యత్తులో ఆయన ప్రధాని అయినా నేను ఆశ్చర్యపడను’’ అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది.
I wont be surprised if #PawanKalyan becomes the PM of the country sometime. ~ #NidhiAgerwal pic.twitter.com/56NOP0Fgtl
— Cinema Manishi News (@cinema_manishi) January 21, 2026
కాగా హరి హర వీరమల్లు తర్వాత ప్రభాస్ తో కలిసి ది రాజాసాబ్ సినిమాలో కథానాయికగా నటించింది నిధి అగర్వాల్. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.