God Father: గాడ్ ఫాదర్ సక్సెస్ పై నయన్ రియాక్షన్.. లేడీ సూపర్ స్టార్ స్పెషల్ నోట్..

|

Oct 09, 2022 | 7:36 AM

ఈ సినిమా సక్సెస్ కావడంతో హీరోయిన్ నయన్ అభిమానులను ఉద్దేశిస్తూ స్పెషల్ నోట్ షేర్ చేసింది. గాడ్ ఫాదర్ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు అభిమానులకు.. ప్రేక్షకులను థాంక్స్ చెప్పింది.

God Father: గాడ్ ఫాదర్ సక్సెస్ పై నయన్ రియాక్షన్.. లేడీ సూపర్ స్టార్ స్పెషల్ నోట్..
Nayanthara
Follow us on

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాకుండా.. ఇందులో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ కీలకపాత్రలు పోషించడం సినిమాకు మరో హైలెట్ అని చెప్పుకొవాలి. మలయాళీ చిత్రం లూసీఫర్ రీమేక్‏గా వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్క్ కు చేరవైంది గాడ్ ఫాదర్. డైరెక్టర్ మోహన్ రాజా స్క్రీన్ ప్లే పై సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో శనివారం సాయంత్రం గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. మరోవైపు ఈ సినిమా సక్సెస్ కావడంతో హీరోయిన్ నయన్ అభిమానులను ఉద్దేశిస్తూ స్పెషల్ నోట్ షేర్ చేసింది. గాడ్ ఫాదర్ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు అభిమానులకు.. ప్రేక్షకులను థాంక్స్ చెప్పింది.

పొలిటికల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో నయన్.. చిరు చెల్లెలి పాత్రలో నటించారు. “గాడ్‌ఫాదర్‌ను భారీ బ్లాక్‌బస్టర్‌గా చేసినందుకు సినీ ప్రియులకు, నా అభిమానులకు ధన్యవాదాలు. మీరందరూ థియేటర్‌లో మీ ఆత్మీయులతో కలిసి మా చిత్రాన్ని చూడడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. ఎందుకంటే ఈ సినిమాలోని నటీనటులు.. యూనిట్ సభ్యులు ఓ అద్భుతమైన బృందం. మెగాస్టార్ చిరంజీవి గారితో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. ఆయనతో సెట్‌లో ఉన్న ప్రతి క్షణం అద్భుతం. చిరంజీవి గారికి ధన్యవాదాలు.

నిరంతరం నాపై నమ్మకం ఉంచి మూడోసారి నాకు సహకరించినందుకు దర్శకుడు మోహన్ రాజా గారికి నా కృతజ్ఞతలు. ‘సత్యప్రియ’ అనేది లేయర్డ్ , కాంప్లెక్స్ క్యారెక్టర్ , నాపై డైరెక్టర్‌కి ఉన్న నమ్మకం వల్లే ఆమెకు ప్రాణం పోయడం సాధ్యమైంది. ప్రతి ఒక్కరూ సల్మాన్ ఖాన్ సర్‌ని ప్రేమిస్తారు. మీ అద్భుతమైన నటనతో ఈ చిత్రాన్ని మరింత హిట్ చేసినందుకు ధన్యవాదాలు సర్. నా నటనను తీర్చిదిద్ది, నన్ను మంచి నటిగా మార్చే నా సహనటులందరికీ నా ప్రేమ , గౌరవం. సత్యదేవ్ , తెరపై నా సోదరి తాన్య గురించి ప్రత్యేకంగా చెప్పాలి. గాడ్ ఫాదర్ ప్రపంచానికి మీ నైపుణ్యం, ప్రతిభను అందించినందుకు సంగీత దర్శకుడు థమన్ , సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా సర్‌కి ధన్యవాదాలు. మొత్తం సిబ్బందికి వారి కృషికి ధన్యవాదాలు.

ఇంత భారీ కాన్వాస్‌పై ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించినందుకు ఆర్‌బి చౌదరి సార్ , ఎన్‌వి ప్రసాద్ సర్‌లకు నా కృతజ్ఞతలు. ఏ నటుడు లేదా టెక్నీషియన్ కలలు కనే కలల నిర్మాతలు మీరే. 100 చిత్రాల మ్యాజికల్ మార్క్‌కు చేరువలో ఉన్నందుకు ప్రయత్నపూర్వకంగా , హృదయపూర్వక అభినందనలు తెలిపినందుకు సూపర్ గుడ్ ఫిల్మ్స్ టీమ్ మొత్తానికి ధన్యవాదాలు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ టీమ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. చివరగా, పండుగల సీజన్‌లో ఇంతటి బ్లాక్‌బస్టర్‌ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు.

లవ్, నయనతార” అంటూ రాసుకొచ్చింది నయన్.