Nayanthara: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

|

Sep 18, 2022 | 10:11 AM

ఇక ఇటీవలే ప్రియుడు డైరెక్టర్ విఘ్నేష్ శివన్‏ను వివాహం చేసుకున్న నయన్.. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Nayanthara: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..
Nayan
Follow us on

దక్షిణాది చిత్రపరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు నయనతార (Nayanthara ). అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరోయిన్ నయన్ కావడం విశేషం. సినిమా చేయడం వరకే నయన్ ఉంటుంది.. ఆ తర్వాత ప్రమోషన్లలో ఎక్కడా కనిపించదు. అయినా ఈ అమ్మడుకు మాత్రం ఆఫర్లు క్యూ కడుతుంటాయి. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ ఇలా ఇలా ఒక్కటేమిటీ అన్ని భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ అరంగేట్రం సైతం చేయనుంది. షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న జవాన్ చిత్రంలో నయన్ కథానాయికగా నటిస్తోంది. ఇక ఇటీవలే ప్రియుడు డైరెక్టర్ విఘ్నేష్ శివన్‏ను వివాహం చేసుకున్న నయన్.. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

లేటేస్ట్ సమాచారం ప్రకారం నయన్ ఒక్కో సినిమాకు రూ. 10 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే.. ఆమె ఆస్తి విలువ దాదాపు రూ. 165 కోట్లు ఉందట. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు వాణిజ్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది. ఇందుకుగానూ ఒక్కో సంస్థ నుంచి రూ. 5 కోట్లు పారితోషికం తీసుకుంటుందట. అలాగే ఆమెకు హైదరాబాద్ లో రెండు ఖరీదైన బంగ్లాలు, చెన్నైలో అధునాతర వసతులతో కూడిన నాలుగు ప్లాట్లు, కేరళలోని తన తల్లిదండ్రులు నిర్వహిస్తున్న ఇల్లు.. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సొంత ఇళ్లను ఏర్పాటు చేసుకుందట. హైదరాబాద్ లోని ఒక్కో ప్లాట్ సుమారు రూ. 15 కోట్లు విలువ చేస్తుందట. అంతేకాకుండా ఆమెకు ప్రత్యేకంగా ఒక జెట్ విమానం కూడా ఉందని సమాచారం. ఇక గత కొద్ది రోజులుగా నయన్ సినిమాల కంటే బిజినెస్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలు కంపెనీలతో భాగస్వామ్యం కూడా ఏర్పర్చుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం నయన్.. డైరెక్టర్ అట్లీ, షారుఖ్ ఖాన్ కాంబోలో రాబోతున్న జవాన్ చిత్రంలో నటిస్తుంది.