Nabha Natesh: కుర్రాళ్ళ గుండెల్ని గాలమేసి లాగుతోన్న ఇస్మార్ట్ బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్ చూస్తే ఇక అంతే

|

Aug 28, 2022 | 3:22 PM

ఒకే ఒక్క సినిమాతో కావాల్సినంత క్రేజ్ సొంతం చేసుకున్న బ్యూటీలు టాలీవుడ్ లో చాలా మందే ఉన్నారు. అయితే ఆ క్రేజ్ ను కంటిన్యూ చేస్తూ ఆఫర్లు అందుకుంటున్న హీరోయిన్స్ మాత్రం తక్కువే అని చెప్పాలి.

Nabha Natesh: కుర్రాళ్ళ గుండెల్ని గాలమేసి  లాగుతోన్న ఇస్మార్ట్ బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్ చూస్తే ఇక అంతే
Nabha Natesh
Follow us on

ఒకే ఒక్క సినిమాతో కావాల్సినంత క్రేజ్ సొంతం చేసుకున్న బ్యూటీలు టాలీవుడ్ లో చాలా మందే ఉన్నారు. అయితే ఆ క్రేజ్ ను కంటిన్యూ చేస్తూ ఆఫర్లు అందుకుంటున్న హీరోయిన్స్ మాత్రం తక్కువే అని చెప్పాలి. ఇక మిగిలిన వారు ఆ క్రేజ్ ను ఉపయోగించుకొని ఆఫర్లు అందుకుంటున్న అనుకున్న స్థాయిలో హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నారు. ఆ లిస్ట్ లో ఈ బ్యూటీ కూడా ఒకరు. నభానటేష్(Nabha Natesh)గుర్తుందా..? నన్ను దోచుకుందువటే  సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. చూడటానికి అచ్ఛం పక్కింటి అమ్మాయిలా ఉండే నభా. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది.

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నభా నటనకు అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెలంగాణ యాసలో ఈ అమ్మడు చెప్పిన డైలాగులు, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ అమ్ముడుకి ఆ సినిమాతర్వాత వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ హిట్ మాత్రం అవ్వలేదు. రవితేజ సరసన డిస్కో రాజా సినిమా చేసినా అది ఫ్లాప్ గా నిలిచింది. చివరిగా ఈ అమ్మడు బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో సినిమాలు ఏమి లేవని తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటోంది ఈ భామ. నిత్యం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి