Mrunal Thakur: ఒక్క హిట్‎తో రెమ్యునరేషన్ పెంచేసిన సీత ?.. తెలుగులో మృణాల్‏కు వరుస ఆఫర్లు..

ఇక లేటేస్ట్ సమాచారం ప్రకారం మృణాల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందట. ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తన పారితోషికం పెంచేసిందని టాక్ వినిపిస్తోంది.

Mrunal Thakur: ఒక్క హిట్‎తో రెమ్యునరేషన్ పెంచేసిన సీత ?.. తెలుగులో మృణాల్‏కు వరుస ఆఫర్లు..
Mrunal

Updated on: Aug 28, 2022 | 8:18 AM

డైరెక్టర్ హనురాఘవపూడి తెరకెక్కించిన లేటేస్ట్ చిత్రం సీతారామం. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ , బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమైంది మృణాల్ (Mrunal Thakur). మొదటి సినిమాతో అందం, అభినయంతో తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో సీత పాత్రలో జీవించేసింది. ఒక్క మూవీతోనే తెలుగులో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది మృణాల్. సీరియల్స్ ద్వారా బుల్లితెర అరంగేట్రం చేసిన ఈ చిన్నది.. ఇప్పుడు వెండితెరపై సత్తా చాటుతుంది. హిందీలో వరుస సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటుంది. ఇప్పటికే మృణాల్ పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇక లేటేస్ట్ సమాచారం ప్రకారం మృణాల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందట. ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తన పారితోషికం పెంచేసిందని టాక్ వినిపిస్తోంది. అయితే మృణాల్ రెమ్యునరేషన్ మరీ కాకపోవడంతో నిర్మాతలు సైతం ఒకే అంటున్నారట. ప్రస్తుతం మృణాల్ ఒక్కో రూ. కోటి డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇక సీతారామం నిర్మించిన వైజయంతి బ్యానర్ పై మరో ప్రాజెక్టుకు సీత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. డైరెక్టర్ బీవీ నందిని రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించనున్నాడట. లేడీ ఓరియెంటెడ్‏గా రాబోతున్న ఈ సినిమాలో మృణాల్ పాత్ర మరింత పవర్‏ఫుల్‏గా ఉండనుందట.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.