Actress Mohini: ఏ కష్టాలు లేవు.. అయినా ఏడుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాను.. హీరోయిన్ మోహిని..

ఒకప్పుడు తెలుగు సినీరంగంలో అందం, అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఒకటి రెండు చిత్రాలతోనే ఇండస్ట్రీలో ఫేమస్ అయిన స్టార్స్ గురించి చెప్పక్కర్లేదు. అలాంటి వారిలో మోహిని ఒకరు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన పర్సనల్ లైఫ్ గురించి వెల్లడించింది.

Actress Mohini: ఏ కష్టాలు లేవు.. అయినా ఏడుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాను.. హీరోయిన్ మోహిని..
Mohini

Updated on: Sep 16, 2025 | 4:39 PM

దక్షిణ భారత సినిమాల్లో ఒకప్పుడు నటి మోహిని టాప్ హీరోయిన్. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది. 2011లో చివరిసారిగా స్క్రీన్ పై కనిపించిన ఆమె.. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండిపోయింది. కానీ ఇప్పటికీ ఆమె అందం, యాక్టింగ్ అడియన్స్ హృదయాల్లో నిలిచిపోయాయి. ఆమెకు చాలా మంది అభిమానులు ఉన్నారు. మోహిని 23 సంవత్సరాల వయసులో వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమై తన భర్తతో కలిసి అమెరికాలో స్థిరపడింది. చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన మోహిని ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‏లో యమ క్రేజ్..

వివాహం తర్వాత, తన భర్త, పిల్లలతో సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడిపుతున్నాని చెప్పింది. కానీ ఒక సమయంలో తనకు తెలియకుండానే డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని.. తన జీవితంలో ఎటువంటి సమస్యలు లేవని, అయినప్పటికీ తాను డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని.. తనకు తెలియకుండానే ఏడుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించానని తెలిపింది. ఆ సమయంలోనే ఒక జ్యోతిష్కుడిని కలిశానని.. అతడు తనపై చేతబడి జరిగిందని చెప్పారని తెలిపింది.

ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

మొదట్లో ఆమె దానిని నవ్వి, తర్వాత తాను ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని భావించి ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చింది. తర్వాత భగవంతుడిని నమ్ముకుని దాని నుచంమి బయటపడ్డానని తెలిపింది. మోహిని తెలుగులో బాలకృష్ణతో కలిసి ఆదిత్య 369 చిత్రంలో నటించింది.

ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..

ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

Follow Us