Megha Akash: పేరుకు తమిళ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయే అయినా తెలుగు సినిమా ద్వారా చిత్ర సీమకు పరిచయమైంది అందాల తార మేఘా ఆకాష్. తొలి చిత్రం నితిన్ హీరోగా నటించిన ‘లై’లో నటించి మెప్పించిందీ బ్యూటీ. అనంతరం ‘ఛల్ మోహనరంగ’తో మరోసారి నితిన్‌తో జతకట్టిన ఈ చిన్నది మూడో చిత్రంతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. పేరెంట్స్ సినిమా ఇండస్ట్రీకి చెందిన వారైనప్పటికీ వారి ప్రభావం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతోందీ బ్యూటీ. ఇదిలా ఉంటే ‘ఛల్ మోహనరంగ’ సినిమా తర్వాత మేఘా.. మళ్లీ తెలుగులో పెద్దగా కనిపించలేదని చెప్పాలి. అయితే మళ్లీ దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ అమ్మడు తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందకు రానుంది.
‘రాజరాజ చోర’ అనే సినిమాతో మేఘా మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు పరిచయమైంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఈనెల 19న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే మేఘా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలుగులో ఇన్నేళ్లు గ్యాప్ రావడానికి గల కారణాన్ని వివరిస్తూ.. మంచి కథ దొరకకపోవడం వల్లే గ్యాప్ తీసుకున్నానని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ఇక తమిళంలో భిన్నమైన కాన్సెప్ట్‌తో కథలు రావడం వల్లే అక్కడ వరుస సినిమాలు చేశానని తెలిపింది. ఇక రాజరాజ చోర సినిమా గురించి చెబుతూ.. తాను ఇందులో సంజన అనే పాత్రలో కనిపిస్తున్నానని, ఇది అందంతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర అని తెలిపింది. ఇక సినిమాల ఎంపిక విషయంలో తనకు నచ్చిన నిర్ణయాన్ని తీసుకుంటానని తెలిపిన మేఘా.. ఇందులో తల్లిదండ్రుల నుంచి ఎలాంటి సలహాలు, సూచనలు తీసుకోను అని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే తెలుగులో దాదాపు నాలుగేళ్లు గ్యాప్ ఇచ్చిన మేఘా.. ఆ గ్యాప్‌ను ఫిల్ చేసేందుకుగాను వరుస సినిమాలకు ఓకే చెప్పింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ‘డియర్ మేఘ’ ‘గుర్తుందా శీతాకాలం’ ‘మనుచరిత్ర’ వంటి సినిమాల్లో నటిస్తోంది.
Also Read: Supritha: షాంపెన్ పొంగించి.. పార్టీలో రచ్చ చేసిన సురేఖ వాణీ కూతురు.. వైరల్ అవుతున్న వీడియో..
Allu Arjun’s Pushpa: పులిలా రికార్డులను వేటాడుతున్న పుష్పరాజ్.. ఫస్ట్ సాంగ్‌తోనే షురూ చేశాడు..