Vikram Chiyaan: లక్కంటే ఈ ముద్దుగుమ్మదే.. విక్రమ్ సరసన టాలీవుడ్ హీరోయిన్.. క్రేజీ కాంబినేషన్ గురూ..

సౌత్ ఇండస్ట్రీలో సాహసాలకు కేరాఫ్ అడ్రస్ విక్రమ్ చియాన్. సినిమా కోసం ఎంతటి రిస్క్ అయినా చేసేందుకు ముందుంటారు. కానీ కొన్నాళ్లుగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ 2 తర్వాత విక్రమ్ చియాన్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేదు. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై మరింత ఫోకస్ పెట్టారు.

Vikram Chiyaan: లక్కంటే ఈ ముద్దుగుమ్మదే.. విక్రమ్ సరసన టాలీవుడ్ హీరోయిన్.. క్రేజీ కాంబినేషన్ గురూ..
Vikram

Updated on: May 24, 2025 | 4:37 PM

కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోలలో విక్రమ్ చియాన్ ఒకరు. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా నిత్యం విభిన్నమైన కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తన సినిమా, పాత్ర కోసం ఎలాంటి రిస్క్ అయిన చేసేందుకు ముందుంటారు. అలాగే ఎప్పుడూ తన సినిమాల్లో కొత్తగా కనిపించేందుకు ముందుంటారు. ఇటీవల తంగలాన్, వీర ధీర సూరన్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు విక్రమ్. ఇక ఇప్పుడు తన 63వ సినిమా కోసం రెడీ అవుతున్నారు. మండేలా, మావీరన్ వంటి విజయవంతమైన సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ మడోనా అశ్విన్ ఈ చిత్రానికి కథ, దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. దీంతో విక్రమ్ చియాన్ తదుపరి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

శాంతి పిక్చర్స్ బ్యానర్ పై రానున్న ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గా్ల్లో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో విక్రమ్ సరసన ఏ హీరోయిన్ నటించనున్నారన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఇందులో ప్రియాంక మోహన్, శ్రీనిధి శెట్టి నటించనున్నారనే టాక్ వినిపించింది. ఇక తాజాగా మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఆమె మరెవరో కాదండి.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి. కొన్నాళ్లుగా తెలుగులో వరుస హిట్లతో ఫుల్ జోష్ మీదుంది ఈ హీరోయిన్.

లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో హిట్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు విక్రమ్ చియాన్ సరసన నటించనున్నట్లు సమాచారం. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటివరకు వరుస హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదున్న మీనాక్షి చౌదరి.. ఇప్పుడు తమిళంలో విక్రమ్ చియాన్ మూవీతో జోడి కట్టనుంది. దీంతో వీరిద్దరి కాంబోలో మరింత క్యూరియాసిటీ నెలకొంది.

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..