కావాలని చేయలేదు.. కానీ ఆ స్టార్ హీరో సినిమా ఛాన్స్ మిస్ అయ్యింది.. చాలా బాధపడ్డా

సీనియర్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ సినిమాలు చేసిందీ అందాల తార. స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగుతో అయితే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, రజినీ వంటి స్టార్ హీరోలతో అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది.

కావాలని చేయలేదు.. కానీ ఆ స్టార్ హీరో సినిమా ఛాన్స్ మిస్ అయ్యింది.. చాలా బాధపడ్డా
Meena

Updated on: May 30, 2026 | 8:15 AM

ప్రముఖ నటి మీనా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం మీనా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కాగా ఓ ఇంటర్వ్యూలో మీనా మాట్లాడుతూ..  తన నటనా ప్రస్థానం, తన కెరీర్ ఎంపికలు, బాలీవుడ్ అవకాశాలపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.  తన పాత్రలను “గ్లిజరిన్ క్యారెక్టర్స్”, “పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్”గా, “క్యారెక్టర్-ఓరియెంటెడ్” అని మీనా అన్నారు. మీనా ఉన్నారంటే “100శాతం గ్లిజరిన్ బాటిల్స్ ఉండాల్సిందే” అని అప్పట్లో ఒక ట్రెండ్ ఉండేదని ఆమె గుర్తుచేసుకున్నారు. సావిత్రి, శ్రీదేవి వంటి వారి సినిమాలు చూసినా, వారిని ఫాలో అవ్వకుండా తనదైన ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నానని మీనా అన్నారు. మీనా తన కెరీర్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి దక్షిణాది భాషలలోనే ఎక్కువగా పనిచేశారు. ఆమె ఒక హిందీ సినిమా (పర్దా హై పర్దా) మాత్రమే చేశారు. హిందీలో ఎందుకు కొనసాగలేదని అడిగినప్పుడు, దక్షిణాదిలో తాను “చాలా బిజీగా” ఉన్నానని, రోజుకు రెండు లేదా మూడు షిఫ్ట్‌లు పని చేసేదాన్ని అని తెలిపారు. నిద్రపోవడానికి, భోజనం చేయడానికి కూడా సమయం ఉండేది కాదని ఆమె చెప్పారు.

ఇది కూడా చదవండి : బాలయ్య సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్‌గా హీరోయిన్‌గా చేసిన ఏకైక నటి.. ఆ కుర్రాడు కూడా హీరోనే

సౌత్ లో డేట్స్ మానేసి బాలీవుడ్‌కి వెళ్తే ఇక్కడి నిర్మాతలు కోపగించుకుంటారని మీనా తెలిపింది. అంతేకాకుండా, బాలీవుడ్‌లో ఒక సినిమాను పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పడుతుందని, దక్షిణాది చిత్ర పరిశ్రమలాగా అంత “డిసిప్లిన్‌డ్”గా ఉండరని తాను విన్నానని మీనా పేర్కొన్నారు. అక్కడ ఒక సినిమా చేయడం ఇక్కడ నాలుగు సినిమాలు చేయడానికి సమానమని ఆమె అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో బాలీవుడ్ గురించి ఆలోచించలేకపోయానని, అయితే హిందీలో నటించాలని కోరుకున్నానని తెలిపారు. హేమమాలిని, వైజయంతిమాల, పద్మిని, రేఖ వంటి నటీమణులు మద్రాసు నుంచి బాలీవుడ్‌కు వెళ్లి విజయం సాధించినప్పటికీ, తనకు బాలీవుడ్‌లో విజయం సాధించాలని ఎప్పుడూ అనిపించలేదని తెలిపారు. హేమమాలిని తప్ప మిగిలిన వారు అక్కడికి వెళ్లడానికి చాలా సినిమాలు వదులుకున్నారని ఆమె గుర్తుచేశారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Folk Song: ఏం పాట మావ..! అమ్మాయిలు తెగ పాడుకుంటున్న సాంగ్.. వచ్చి 5 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే

మీనాకు దక్షిణాదిలో తమిళం, తెలుగు సహా అన్ని భాషల నుంచి మంచి ఆఫర్లు వచ్చాయి. ఇక్కడ తనకు లభిస్తున్న మంచి అవకాశాలను వదులుకుని, బాలీవుడ్‌లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలోకి వెళ్లడం ఇష్టం లేదని ఆమె అన్నారు. మిథున్ చక్రవర్తి నుంచి తనకు చాలా ఆఫర్లు వచ్చాయని మీనా తెలిపారు. ఊటీకి షూటింగ్ కోసం వెళ్లినప్పుడు, మిథున్ చక్రవర్తిగారి హోటల్‌లో ఉండటానికి భయపడేదాన్నని ఆమె సరదాగా చెప్పారు. ఆయన తన గది వద్దకు వచ్చి, “మీనా జీ, మీరు నాతో సినిమాలు ఎందుకు చేయడం లేదు.?” అని అడిగేవారని, అంత పెద్ద వ్యక్తిని కాదంటే ఇబ్బందిగా అనిపించేదని ఆమె అన్నారు. అలాగే ఆమె మాట్లాడుతూ తెలుగులోనే నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆతర్వాతే తమిళ్, మలయాళ సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. అలాగే తాను మిస్ చేసుకున్న సినిమాలు చాలా పెద్ద హిట్ అయినప్పుడు చాలా బాధగా అనిపించేది మీనా అన్నారు. అలాగే తెలుగులో నాగార్జున నటించిన నిన్నేపెళ్లాడతా సినిమా మిస్ అయ్యింది. అప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను. డేట్స్ అడ్జెస్ట్ అవ్వలేకపోవడంతో ఆ సినిమా మిస్ అయ్యింది. సినిమా కోసం 60 రోజులు డేట్స్ అడిగారు.. అప్పుడు తమిళ్ లో కొన్ని సినిమాలకు కమిట్ అయ్యాను.. దాంతో నిన్నే పెళ్లాడతా సినిమా మిస్ అయ్యింది. ఆతర్వాత ఆ సినిమా చూసినప్పుడు చాలా బాధగా అనిపించింది. అయ్యో మంచి సినిమా మిస్ అయ్యాను అని ఏడ్చేశాను.. అలాగే నరసింహ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర మిస్ అయ్యాను. కమల్ హాసన్ తో ఓ సినిమా మిస్ అయ్యింది.

ఇది కూడా చదవండి : Shruti Haasan: ఆ సాంగ్ వల్ల.. నన్ను ఇష్టపడని వారు కూడా నాకు ఫోన్ చేసి మెచ్చుకున్నారు..

నాగార్జున ఫ్యాన్ ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us