Meena: భర్త మరణంపై వస్తున్న వార్తలపై స్పందించిన మీనా.. ఎమోషనల్ లేఖ విడుదల

శ్వాసకోశ సమస్యతో నటి మీనా భర్త విద్యాసాగర్‌ జూన్‌ 29న చెన్నైలోని ఓ ఆస్పత్రిలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన హఠాన్మరణంపై రకరకాల వార్తలు సర్కులేట్ అయ్యాయి.

Meena: భర్త మరణంపై వస్తున్న వార్తలపై స్పందించిన మీనా.. ఎమోషనల్ లేఖ విడుదల
Meena

Updated on: Jul 01, 2022 | 6:44 PM

Meena husband’s death: దక్షిణాదిలో మంచి టాలెంట్ ఉన్న నటిగా పేరు తెచ్చుకున్న మీనా((Meena) భర్త విద్యాసాగర్‌ (Vidya Sagar) ఇటీవల హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. శ్వాసకోశ సమస్యతో విద్యాసాగర్‌ జూన్‌ 29న చెన్నైలోని ఓ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో మీనా పుట్టెడు దు:ఖంలో మునిగిపోయారు. అయితే  విద్యాసాగర్‌ మరణానికి కారణం పావురాలు అంటూ ఇటీవల వార్తలు పెద్ద ఎత్తున సర్కులేట్ అయ్యాయి. పావురాల విసర్జితాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే ఆయనకు శ్వాసకోశ సమస్యలు తలెత్తాయని ప్రచారం జరిగింది. ఈ వార్తలపై తాజాగా మీనా రెస్పాండ్ అయ్యారు. ఇకపై ఇలాంటి వార్తలను సర్కులేట్ చేయడం ఆపాలంటూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ లేఖను పోస్ట్ చేశారు. 

‘‘భర్త శాశ్వతంగా దూరమవ్వడంతో నేను ఎంతో వేదనలో ఉన్నా. దయ ఉంచి మా కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించకండి. పరిస్థితి అర్థం చేసుకోండి. నా భర్త మరణం గురించి దయచేసి ఎలాంటి తప్పుడు వార్తలు సర్కులేట్ చేయొద్దని మీడియాను వేడుకుంటున్నా. ఈ బాధాకర సమయంలో మాకు తోడుగా నిలిచినవారికి.. సాయంగా నిలబడ్డవారికి  ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా భర్త ప్రాణాలు కాపాడేందుకు ఎంతగానో ప్రయత్నించిన మెడికల్ టీమ్‌కు, తమిళనాడు సీఎం, హెల్త్ మినిస్టర్, ఐఏఎస్‌ రాధాకృష్ణన్‌, మా ఫ్రెండ్స్, మీడియాకు థ్యాంక్స్. నా భర్త త్వరగా కోలుకోవాలని ప్రేయర్స్ చేసిన అభిమానుల ప్రేమకు ఏమిచ్చినా తక్కువే’ అని మీనా ఆ లేఖలో రాసుకొచ్చారు.

విద్యాసాగర్‌కు కిడ్నీల మార్పిడి చేయాల్సి పరిస్థితి వచ్చింది. అయితే డోనర్స్ దొరక్కపోవడంతో పరిస్థితి విషమించి కన్నుమూశారు. అంతకముందు కూడా కరోనా సోకడంతో విద్యాసాగర్‌ ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి