Malavika Satheesan: ‘ఆ ఇద్దరు టాలీవుడ్ హీరోస్ అంటే ఇష్టం.. కానీ అడవి శేష్ నటన నచ్చుతుంది’.. హీరోయిన్ మాళవిక కామెంట్స్ వైరల్..

|

Oct 09, 2022 | 1:57 PM

సినిమా టైటిల్ చూసి ఇది బోల్డ్ ఫిలిం అనుకుంటారు. కానీ ఇది చాలా క్లీన్ మూవీ. యూ/ఎ మూవీ. నటనకు చాలా ఆస్కారం వుండే సినిమా ఇది. ఎమోషన్,

Malavika Satheesan: ఆ ఇద్దరు టాలీవుడ్ హీరోస్ అంటే ఇష్టం.. కానీ అడవి శేష్ నటన నచ్చుతుంది.. హీరోయిన్ మాళవిక కామెంట్స్ వైరల్..
Malavika Sathishan
Follow us on

యంగ్ హీరో విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీషన్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం రోమ్-కామ్ ”బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ (BFH). ఈ చిత్రానికి సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై వేణు మాధవ్ పెద్ది, కె నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీ అక్టోబర్ 14న చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా విలేఖరులో సమావేశంలో హీరోయిన్ మాళవిక సతీషన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తనకు తెలుగులో అడివి శేష్ నటన నచ్చుతుందని.. అలాగే రాజమౌళి సినిమాలో నటించాలని ఉందంటూ చెప్పుకొచ్చింది.

మాళవిక మాట్లాడుతూ.. ” సినిమా టైటిల్ చూసి ఇది బోల్డ్ ఫిలిం అనుకుంటారు. కానీ ఇది చాలా క్లీన్ మూవీ. యూ/ఎ మూవీ. నటనకు చాలా ఆస్కారం వుండే సినిమా ఇది. ఎమోషన్, కామెడీ ఇలా అన్ని కోణాలు చూపించే అవకాశం దొరికింది. చాలా వైవిధ్యమైన కాన్సెప్ట్ వుంటుంది. ఇందులో దివ్య అనే పాత్రలో కనిపిస్తా. నా రియల్ లైఫ్ కి దగ్గరగా వుండే పాత్ర ఇది. బేసిగ్గా సినిమాలల్లో అమ్మాయి వెనుక అబ్బాయి తిరుగుతాడు. కానీ ఇందులో అమ్మాయే అబ్బాయి వెనుక తిరుగుతుంది. కథలో మంచి ఎమోషనల్ జర్నీ వుంటుంది. కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా వుంటుంది. ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం వుంది. థియేటర్ ఎక్స్ పీరియన్స్ వున్న సినిమా ఇది. కోవిడ్ కారణంగా ఆలస్యమైనప్పటికీ ముందు అనుకున్నట్లే థియేటర్లోనే విడుదల చేస్తున్నాం.

ఇవి కూడా చదవండి

నా చదువు ఇప్పుడే పుర్తయింది. చదువు కారణంగా సినిమాల్లో కొంచెం నెమ్మదిగా వున్నా. ఇప్పుడు మూడు సినిమాలు చూస్తున్నా. శివ నాగేశ్వర్ రావు దర్శకత్వంలో దొచేవారెవరురా, అలాగే సూపర్ గుడ్ ఫిలిమ్స్ లో మరో సినిమా చేస్తున్నా. నా జర్నీ చాలా హాయిగా జరుగుతోంది. తెలుగు సినిమా పరిశ్రమ ఎవరినైనా స్వాగతిస్తుంది. తెలుగులో వున్న గొప్పదనం ఇది. అలాగే పాత్రల విషయంలో నాకు ఒక విష్ లిస్టు వుంది. డిఫెన్స్ ఆఫీసర్ గా చేయాలని వుంది. అలాగే మంచి స్పోర్ట్ సినిమా, బయోపిక్ చేయాలని వుంది. అలాగే రాజమౌళి గారి సినిమాలో చేయాలని వుంది. అడవి శేష్ నటన నచ్చుతుంది. అలాగే నాగశౌర్య, అఖిల్ ఇష్టం. ” అంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.