
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్ ఇటీవల తమిళ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏ కొత్త సినిమా అయినా మొదటి వారం రోజలు డైలీ 5 షోస్ వేసుకునేలా విజయ్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించి కోలీవుడ్ స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు సీఎం విజయ్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సీనియర్ నటి కుష్బూ విజయ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కళగం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి విజయ్‌కు ప్రజలు, ప్రతిపక్షాలు కొంత సమయం ఇవ్వాలని ఆమె కోరారు. కేవలం పది రోజుల్లోనే అన్ని మార్పులను ఎలా తీసుకురాగలరని సీనియర్ ప్రశ్నించారు. ప్రస్తుతం తమిళనాడు బుల్లితెర నిర్మాతల సంఘం అధ్యక్షురాలిగా ఉన్న కుష్బూ సచివాలయంలో ముఖ్యమంత్రి విజయ్, విద్యా , సాంస్కృతితిక శాఖ మంత్రి రాజమోహనన్‌ను కలిసి ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కుష్బూ ముఖ్యమంత్రి విజయ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కాస్త భావోద్వేగానికి లోనయ్యారు.
‘ సీఎం విజయ్‌ను నా సొంత తమ్ముడిగా చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఒక అక్కగా ఈరోజు ఆయనను ముఖ్యమంత్రి హోదాలో చూసినప్పుడు నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఆయన పనితీరు, ఆలోచనలు చూస్తుంటే భవిష్యత్తులో తమిళనాడులో కచ్చితంగా ఒక మంచి మార్పును తీసుకువస్తారనే నమ్మకం కలిగింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నింటినీ ఒకే రోజులో సర్దుబాటు చేయడం ఎవరికై నా సాధ్యం కాదు. విజయ్ పగ్గాలు చేపట్టి కేవలం కొన్ని రోజులు మాత్రమే అవుతుంది. ముఖ్యమంత్రికి కాస్త సమయం ఇవ్వండి. తమిళనాడులో కచ్చితంగా మార్పు వస్తుంది. బుల్లితెర రంగంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న, మధ్యతరహా నిర్మాతల సంక్షేమం కోసం కొన్ని ముఖ్యమైన డిమాండ్లను ముఖ్యమంత్రి ముందు ఉంచాము. తమ విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలించిన సీఎం విజయ్, మంత్రి రాజమోహన్ వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు’ అని కుష్బూ చెప్పుకొచ్చారు.
As the President of STEPS (small screen producers council), I along with my team of office bearers, had the honour and privilege to meet the Honorable CM of Tamilnadu, Thiru @actorvijay avl at The Secretariat and felicitate him. Thank your for your time and warmth.
On a personal… pic.twitter.com/uf502FUwmH
— KhushbuSundar (@khushsundar) May 25, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.