Actress : ప్రియుడితో బ్రేకప్.. నలుగురితో రొమాన్స్.. ఇద్దరితో పెళ్లి.. ఇప్పుడు బిగ్ బాస్ లో..

హిందీ సినిమా ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే చేసిన చిన్న చిన్న తప్పులతో వార్తలలో నిలిచింది. ప్రేమ, పెళ్లి అనేవి ఈ నటి జీవితంలో కలిసి రాలేదు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Actress : ప్రియుడితో బ్రేకప్.. నలుగురితో రొమాన్స్.. ఇద్దరితో పెళ్లి.. ఇప్పుడు బిగ్ బాస్ లో..
Kunika

Updated on: Nov 13, 2025 | 11:24 AM

బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది… వెండితెరపై అందం, నటనతో అలరించింది. కానీ రియల్ లైఫ్ మాత్రం ఆశించినంత సక్సెస్ కాలేదు. ఆమె పేరు కునికా సదానంద్. హిందీలో ర్యాప్ సాంగ్స్, నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలతో ఎక్కువగా పాపులర్ అయ్యారి. ఆ క్రేజ్ తోనే టీవీలో సీరియల్స్, సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించి జనాలకు దగ్గరయ్యింది. కానీ సినీరంగంలో సక్సెస్ అయినప్పటికీ నిజ జీవితంలో మాత్రం వివాదాలతో వార్తలలో నటించారు. ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 19లో పాల్గొన్నారు. కునికా సదానంద్.. నార్త్ సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : అప్పుడు ప్రియురాలిగా.. ఇప్పుడు స్పెషల్ సాంగ్.. చిరుతో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..

తనకు డ్రింక్ చేసే అలవాటు ఉందని.. బ్రేకప్ అయిన సమయంలో తాను మందుకు బానిసయ్యానని చెప్పుకొచ్చింది. ఎక్కువగా తాగడం వల్లే బరువు పెరిగానని.. డబ్బింగ్ చెప్పడానికి ఓ స్టూడియోకు వెళ్లినప్పుడు తనను తాను అద్దంలో చూసుకుని షాకయ్యానని తెలిపింది. డ్రింకింగ్ విషయంలో తన తండ్రి హెచ్చరించినప్పటికీ పట్టించుకోలేదని తెలిపింది. బ్రేకప్ తర్వాత ఇద్దరితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నానని.. నలుగురితో రొమాన్స్, రెండు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలిపారు. కునికా ముందుగా ఢిల్లీకి చెందిన అభయ్ కొటారిని పెళ్లి చేసుకుంది. వీరికి కుమారుడు ఉన్నారు. కొంతకాలానికే వీరు విడిపోయారు. ఆ తర్వాత 35 ఏళ్ల వయసులో వినయ్ లాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా.. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. కానీ వీరు కూడా డివోర్స్ తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..

27 ఏళ్ల వయసులోనే సింగర్ కుమార్ సనుతో ప్రేమలో ఉన్నానని… ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో బ్రేకప్ జరిగిందని చెప్పుకొచ్చింది. ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 19లోకి ఎంట్రీ ఇచ్చింది.

Bigg Boss 9 Telugu: సీన్ మారింది.. బిగ్‏బాస్ దుకాణం సర్దేయాల్సిందే.. ఓర్నీ మరి ఇంత అట్టర్‌ఫ్లాపా..

Kunika Life

Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..