Keerthy Suresh: మాహానటి మళ్లీ ప్లాన్ మార్చుకుందా ..? ఆ సక్సెస్‍ఫుల్ డైరెక్టర్‏తో కీర్తి సురేష్..

|

Aug 14, 2022 | 9:39 PM

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రాబోతున్న భోళా శంకర్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో చిరు చెల్లిగా కనిపించనుంది కీర్తి. అలాగే న్యాచురల్ స్టార్ హీరో నాని సరసన దసరా మూవీలోనూ నటిస్తోంది.

Keerthy Suresh: మాహానటి మళ్లీ ప్లాన్ మార్చుకుందా ..? ఆ సక్సెస్‍ఫుల్ డైరెక్టర్‏తో కీర్తి సురేష్..
Keerthy Suresh
Follow us on

నేను శైలజ మూవీతో తెలుగు తెరకు పరిచయమయ్యి.. మహానటి సినిమాతో ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకుంది హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh). ఈ సినిమాతో కీర్తి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకోవడమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా దూసుకుపోయింది. ఇటీవలే సర్కారు వారి పాట చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ఈ చిన్నది.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రాబోతున్న భోళా శంకర్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో చిరు చెల్లిగా కనిపించనుంది కీర్తి. అలాగే న్యాచురల్ స్టార్ హీరో నాని సరసన దసరా మూవీలోనూ నటిస్తోంది. తాజాగా కీర్తి సురేష్ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో కీర్తి సురేష్ ఈ సినిమా చేయనుందట.

ఆకాశమే నీ హద్దురా సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు డైరెక్టర్ సుధా కొంగర. ప్రస్తుతం ఆమె ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. తమిళ్ స్టార్ సూర్య కీలకపాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ తర్వాత సుధా కొంగరా ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. ఇందులోని ప్రధాన పాత్ర కోసం కీర్తిని సంప్రదించగా.. స్టోరీ నచ్చడంతో ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో వీరి ప్రాజెక్ట్ రానుందట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.