Keerthy Suresh: సమంత పై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నదంటే

|

Dec 25, 2024 | 1:06 PM

బేబీ జాన్ చిత్రంలో వరుణ్ ధావన్, కీర్తి సురేష్, వామికా గాబితో పాటు పలువురు ప్రముఖులు నటిస్తున్నారు. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా ఈరోజు డిసెంబర్ 25న విడుదలయ్యింది. తమిళ్ లో మంచి విజయం సాధించిన తేరి సినిమాకు రీమేక్ గా బేబీ జాన్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు అట్లీ నిర్మాతగా మారి సినిమా రూపొందించారు.

Keerthy Suresh: సమంత పై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నదంటే
Actress Keerthy Suresh, Sam
Follow us on

అట్లీ దర్శకత్వం వహించిన తేరి చిత్రం 2016లో విడుదలై మంచి స్పందనను అందుకుంది. స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విజయ్ సరసన ఈ సినిమాలో సరసన సమంతనటించింది. ఈ చిత్రం విజయం తర్వాత, అట్లీ గత సంవత్సరం బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్‌తో దర్శకుడిగా పరిచయం అయ్యారు. దర్శకుడిగా, నిర్మాతగా కొనసాగుతున్న అట్లీ తేరి ఈ చిత్రాన్ని రీమేక్‌ చేశారు. నిర్మాతగా మారి బాలీవుడ్ లో సినిమా రూపొందించారు అట్లీ. ఈ చిత్రానికి ప్రముఖ హిందీ దర్శకుడు ఖలీస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నటుడు విజయ్ పాత్రలో వరుణ్ ధావన్ అలాగే సమంత పాత్రలో కీర్తి సురేష్ నటించారు.

ఈ చిత్రం ద్వారా అందాల భామ కీర్తి సురేష్ హిందీ చిత్రసీమలో హీరోయిన్ గా పరిచయం అవుతుండటం గమనార్హం.ఈ సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత డిసెంబర్ 12న గోవాలో పెళ్లి చేసుకుంది కీర్తిసురేష్. తాజాగా ఓ ప్రమోషన్ కార్యక్రమంలో సమంత గురించి కీర్తిసురేష్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో కీర్తి సురేష్ మాట్లాడుతూ.. ”ఈ బేబీ జాన్ సినిమా కథను హిందీ అభిమానులకు అనుగుణంగా మార్చారు, తమిళ తేరి సినిమాలో సమంత తన నటనను చాలా అందంగా చూపించింది అని చెప్పుకొచ్చింది కీర్తి.

బేబీ జాన్ ప్రమోషన్ కార్యక్రమంలో ఈ చిత్రం గురించి సమంత పాత్ర గురించి కీర్తి సురేష్ మాట్లాడుతూ.. సమంత తేరి సినిమాలో అద్భుతంగా నటించింది. సాధారణంగా రీమేక్ చేయాలంటే భయంగా ఉంటుంది, కానీ బేబీ జాన్‌కి మాత్రం ఆ క్యారెక్టర్‌ని అందంగా తీర్చిదిద్దడం వల్ల నాకు భయం అనిపించలేదు అని చెప్పుకొచ్చింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకంగా థియేటర్లలో విడుదల చేశారు. బేబీ జాన్ సక్సెస్ కోసం చిత్రబృందంతో కలిసి ఈ పూజకు హాజరయ్యారు కీర్తిసురేష్, వరుణ్ ధావన్. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. నటి కీర్తి సురేష్ పెళ్లి తర్వాత సినిమాల్లో నటించదని రూమర్స్ కూడా వచ్చాయి. కానీ ఆమె ప్రస్తుతం రెండు సినిమాల్లో నటించేందుకు కమిట్ అయినట్లు తెలుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి