Keerthy Suresh: మా జంట స్క్రీన్ పై అదిరిపోతోంది.. తారక్ పై కీర్తిసురేష్ క్రేజీ కామెంట్స్

|

Aug 11, 2024 | 8:11 AM

మహానటి సినిమాతో భారీ హిట్ అందుకోవడంతో పాటు తెలుగులో తిరుగులేని హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ అలరిస్తోంది. మొన్నటి వరకు పద్దతిగా కనిపించిన కీర్తిసురేష్.. ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేస్తోంది. గ్లామర్ రోల్స్ చేస్తో అభిమానులను ఆకట్టుకుంటుంది.

Keerthy Suresh: మా జంట స్క్రీన్ పై అదిరిపోతోంది.. తారక్ పై కీర్తిసురేష్ క్రేజీ కామెంట్స్
Ntr
Follow us on

కీర్తిసురేష్ టాలీవుడ్ ప్రేక్షకులకు చాలా దగ్గరైన హీరోయిన్.. నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైనా ఈ చిన్నది తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక మహానటి సినిమాతో భారీ హిట్ అందుకోవడంతో పాటు తెలుగులో తిరుగులేని హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ అలరిస్తోంది. మొన్నటి వరకు పద్దతిగా కనిపించిన కీర్తిసురేష్.. ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేస్తోంది. గ్లామర్ రోల్స్ చేస్తో అభిమానులను ఆకట్టుకుంటుంది. మహేష్ సర్కారు వారి పాట సినిమాలో కాస్త గ్లామర్ గా కనిపించింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది ఈ చిన్నది.

ఇది కూడా చదవండి :  Naga Chaitanya : సమంతతో ఉన్న ఫోటోను పదిలంగా దాచుకున్న నాగ చైతన్య..

సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ క్రేజీ ఫోటోలు షేర్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవలే కీర్తిసురేష్ మెగాస్టార్ చిరంజీవి పై చేసిన కామెంట్స్ వైరల్ ఆయిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, దళపతి విజయ్ ఇద్దరిలో ఎవరు బెస్ట్ డాన్సర్ అంటే విజయ్ పేరు చెప్పింది కీర్తి.. దాంతో మెగా ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ అభిమానులు విజయ్ పై, కీర్తి పై ట్రోల్స్ చేశారు. తాజాగా ఎన్టీఆర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఈ వయ్యారి భామ.

ఇది కూడా చదవండి : Malliswari: తస్సాదీయ..!! మల్లీశ్వరి సినిమాలో చిన్నారి ఇప్పుడు గత్తర లేపిందిగా..!

ఫిలింఫేర్‌ ఈవెంట్‌లో మీడియాతో కీర్తి సురేష్ మాట్లాడింది.. ఆమె మాట్లాడుతూ.. నేను ఎన్టీఆర్ ను మొదటి సారి మహానటి సినిమా ఈవెంట్ లో చూశాను. ఆయనతో కలిసి నటించాలని ఉంది . స్క్రీన్ పై మా ఇద్దరి జంట సూపర్ గా ఉంటుంది. మహానటి సినిమా తర్వాత మా టీమ్ అందరికి తారక్ పార్టీ ఇచ్చాడు. ఎన్టీఆర్ చాలా మంచి వ్యక్తి. చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు అని చెప్పుకొచ్చింది కీర్తిసురేష్. అలాగే అల్లు అర్జున్ గురించి కూడా కామెంట్స్ చేసింది. అవకాశం వస్తే ఒక్కరోజు అల్లు అర్జున్‌లా లైఫ్‌ లీడ్‌ చేయాలనుకుంటానని అని తెలిపింది. అల్లు అర్జున్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనలా డాన్స్ చేయాలనీ ఉంది అని చెప్పుకొచ్చింది కీర్తిసురేష్. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..