
విజయ్ ఆంటోనీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సినిమా బిచ్చగాడు. తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది ఈ సినిమా. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా రీసెంట్ గా బిచ్చగాడు-2 రూపొందిన సంగతి తెలిసిందే. విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. ఈ భామ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన ఏక్ మినీ కథ సినిమాతో పమంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు ఈ మాయ పేరేమిటో అనే సినిమాలో నటించింది. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది.
ఇక బిచ్చగాడు సినిమా హిట్ అవ్వడంతో కావ్య కు క్రేజీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయని తెలుస్తోంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాలతో రెచ్చిపోతోంది. హాట్ హాట్ ఫోటోలకు కావ్య కేరాఫ్ అడ్రస్ అనే చెప్పాలి. వయ్యారాలు ఒలకబోస్తూ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ను ఫిదా చేస్తూనే ఉంది ఈ చిన్నది.
సోషల్ మీడియాలో కావ్యకు 1 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా కావ్య బీచ్ లో ఎంజాయ్ చేస్తోన్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.