Kasthuri: తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల కేసు.. కస్తూరికి అప్పటివరకు రిమాండ్

తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కస్తూరిని శనివారం హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. ఆపై చెన్నైకి తరలించి.. కోర్టులో ప్రవేశపెట్టగా... న్యాయమూర్తి రిమాండ్ విధించారు.

Kasthuri: తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల కేసు.. కస్తూరికి అప్పటివరకు రిమాండ్
Actress Kasthuri
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 17, 2024 | 3:16 PM

తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టయిన నటి కస్టూరికి రిమాండ్ విధించింది ఎగ్మోర్ కోర్టు. ఈ నెల 29 వరకు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో ఆమెను చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలుకి తరలించారు పోలీసులు.

తమిళనాడులో ఈ మధ్య జరిగిన బ్రాహ్మణ సమ్మేళనంలో పాల్గొన్న కస్తూరి.. తెలుగువాళ్లపై కామెంట్స్ చేశారు. 300ఏళ్ల క్రితం రాజుల అంతఃపురంలో సేవ చేయడానికి తెలుగు వాళ్లు తమిళనాడుకి వచ్చారని.. ఇప్పుడు వాళ్లంతా అధికారాన్ని అనుభవిస్తూ.. తమిళులం అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. మరి ఎన్నోఏళ్లుగా ఇక్కడే ఉంటోన్న బ్రాహ్మణులు తమిళులు కాదా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు అటు తమిళనాట.. ఇటు తెలుగురాష్ట్రాల్లో దుమారం రేపాయి. కస్తూరి వ్యాఖ్యలపై తమిళనాడులోని తెలుగుసంఘాలతో పాటు తెలంగాణ బీజీపీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. క్షమాపణలకు డిమాండ్‌ చేసింది. దిగొచ్చిన కస్తూరి టీవీ9 వేదికగా క్షమాపణలు చెప్పారు.

కస్తూరి క్షమాపణలు చెప్పినా తెలుగుసంఘాలు వెనక్కి తగ్గ లేదు. తమిళనాడువ్యాప్తంగా పలు జిల్లాల్లో పోలీసులకు తెలుగు సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. తమిళర మున్నెట్ర పడై అధ్యక్షురాలు ఏకంగా చెన్నై పోలీస్ కమిషనర్‌కు కంప్లయింట్ చేశారు. మరోవైపు తెలుగువారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ అఖిల భారత తెలుగు సమాఖ్య మండిపడింది. చెన్నై ఎగ్మూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఆమెను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని.. కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. కాగా ఈ వ్యాఖ్యల విషయంలోనే… మదురై పోలీసులు నమోదు చేసిన కేసులో.. ఆమె ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టు ఆశ్రయించగా.. అక్కడ చుక్కెదురైంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.