రాత్రి తొమ్మిది నాకు అది కావాల్సిందే.. దాని వల్ల మరుసటి రోజు బాధపడతానన్న నటి

ఒకప్పుడు తోప్ హీరోయిన్, ఇప్పుడు సినిమాల్లో సహాయక పాత్రలు, అలాగే సీరియల్స్ లో నటిస్తూ మెప్పిస్తుంది. ఆమె అందం, అభినయానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సినిమాలతోనే కాదు వివాదాలతోనే పాపులర్ అయ్యింది ఆమె. తాజాగా ఆమె చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రాత్రి తొమ్మిది నాకు అది కావాల్సిందే.. దాని వల్ల మరుసటి రోజు బాధపడతానన్న నటి
Tollywood News

Updated on: Mar 15, 2026 | 7:41 PM

హీరోయిన్స్ చాలా మంది గతంలో సినిమాల్లో రాణించి ఆతర్వాత గ్యాప్ తీసుకొని ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు సీరియల్స్ చేస్తున్నారు. కొంతమంది పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయితే మరికొంతమంది అవకాశాలు తగ్గడంతో కనిపించకుండా మాయం అయ్యారు. ఇక ఇప్పుడు కొంతమంది సీనియర్ హీరోయిన్స్ అమ్మ, అత్త, వదిన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకరు. ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసిన ఈ వయ్యారి భామ ఇప్పుడు సీరియల్స్, సినిమాల్లో సహాయక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది. అంతే కాదు పలు వివాదాల్లోనూ ఇరుక్కుంది ఆమె.. అయితే ఆమెకు ఓ వింత కోరిక ఉందట.. రాత్రి తొమ్మిది తర్వాత తాను తాను కంట్రోల్ చేసుకోలేని అని చెప్పుకొచ్చింది. ఇంతకూ ఆమె ఎవరు.? ఆమె వింత కోరిక ఏంటో ఒక్కసారి చూద్దాం.!

ఒకప్పుడు తన నటనతో, అందంతో మెప్పించిన హీరోయిన్స్ లో కస్తూరి శంకర్ ఒకరు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలు, సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది నటి కస్తూరి శంకర్. కస్తూరి ఒకప్పుడు హీరోయిన్ గా నటించింది. చాలా సూపర్ హిట్ సినిమాలు చేసింది కస్తూరి. అన్నమయ్య, పెద్దరికం, భారతీయుడు సినిమాలు చేసింది. ప్రస్తుతం కస్తూరి సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ నటిస్తుంది.

ఇవి కూడా చదవండి

తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకు ఓ విచిత్రమైన వ్యసనం ఉందని సరదాగా తెలిపింది కస్తూరి. ప్రతిరోజు రాత్రి 9 గంటల తర్వాత తనకు ఓ కోరిక మొదలవుతుందని. తనను తాను కంట్రోల్ చేసుకోలేను అని తెలిపింది. ఆ వ్యసనం ఏంటో కాదు.. బంగాళాదుంప చిప్స్ తినడం.. రాత్రి సమయంలో తనకు చిప్స్ తినడం అలవాటు.. మరుసటి రోజు దాని వల్ల చాలా ఇబ్బందిపడతాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక పై వాటిని ముట్టుకోకూడదు అనుకుంటా అంటూ నవ్వుకుంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us