
ప్రభాస్ ఫ్యాన్స్ అంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తోన్న సినిమా ఆదిపురుష్. రెబల్ స్టార్ ను రాముడి అవతారంలో చూడటానికి అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సీతగా కనిపించనుంది. అలాగే విలక్షణ నటుడు సైఫ్ అలీ ఖాన్ లంకేశ్ గా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ , ట్రైలర్స్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఇక ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ పై వివాదాలు కూడా ఎక్కువవుతున్నాయి. మొన్నామధ్య విడుదలైన టీజర్ పై కొన్ని విమర్శలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్ ఆకట్టుకోలేక పోయింది అనే టాక్ వినిపించింది. ఇక రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ పై కూడా కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా నటి కస్తూరి కూడా ఆదిపురుష్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాముడికి మీసాలు ఏంటి అంటూ కొందరు సీరియస్ అవుతున్న నేపథ్యంలో నటి కస్తూరి కూడా ఇదే ఇష్యు పై హాట్ కామెంట్స్ చేశారు. ‘ఆదిపురుష్’ పోస్టర్‌పై విమర్శల చేశారు. ఈ పోస్టర్స్ లో ప్రభాస్ ను చూస్తుంటే రాముడు గుర్తురావడం లేదు కర్ణుడు గుర్తున్నాడు.
ఆదిపురుష్ సినిమాలో రాముడితో పాటు లక్ష్మణుడికి మీసాలు ఉండటం ఏంటి.? అంటూ ప్రశ్నించారు కస్తూరి. ఆమె ఇటీవల మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది రాముడి పాత్రల్లో అద్భుతంగా కనిపించి మెప్పించారు.. కానీ ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిలా లేడు కర్ణుడిగా అనుపిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేశారు. కస్తూరి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.