
చాల మంది సీరియల్ బ్యూటీస్ చాలా మంది సినిమాల్లోనూ నటిస్తున్నారు. అలాంటి వారిలో కరుణ భూషణ్ ఒకరు. ఈ భామ ప్రస్తుతం సీరియల్స్ లోనూ నటిస్తూ అలరిస్తుంది. చూడటానికి అచ్చం సినిమా హీరోయిన్ లా ఉండే ఈ ముద్దుగుమ్మ. కరుణ భూషణ్ సీరియల్స్ తో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. గతంలో కరుణ భూషణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే ఓ హీరో గురించి ఆమె చాలా గొప్పగా చెప్పారు. ఆ స్టార్ హీరో వ్యక్తిత్వం గురించి, అలాగే ఆయన ఒక్కసారి నమ్మితే ప్రాణం ఇచ్చేస్తారు అని తెలిపారు. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.?
కరుణ భూషణ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలకృష్ణగారితో తన అనుభవాలను, ఆయన వ్యక్తిత్వంలోని విశేషాలను పంచుకున్నారు. బాలయ్య గారు నమ్మితే ప్రాణం ఇస్తారు అంటూ ఆయన గురించి చెప్పారు. చిరంజీవిగారితో పని చేసిన తర్వాత బాలకృష్ణగారితో అధినాయకుడు చిత్రంలో పనిచేసే అవకాశం వచ్చిందని కరుణ భూషణ్ తెలిపారు. బాలకృష్ణగారు ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని, షూటింగ్ సమయంలో ఆయన స్వీట్‌హార్ట్‌లా ఉండేవారని ఆమె అన్నారు. చిత్రీకరణ సమయంలో కరుణ భూషణ్ ఐదవ నెల గర్భవతిగా ఉన్నప్పుడు, బాలకృష్ణగారు తన పట్ల ఎంతో శ్రద్ధ చూపారని, జాగ్రత్తగా ఉండమని సలహాలిచ్చారని గుర్తుచేసుకున్నారు.
షూటింగ్ పూర్తయిన రెండు నెలల తర్వాత ఫోన్ చేసి బిడ్డ గురించి అడిగినప్పుడు తాను ఆశ్చర్యపోయానని ఆమె తెలిపారు. బాలకృష్ణ గారు నాకు ఫోన్ చేసి అడగడం ఏంటి అంటూ షాక్ అయ్యాను అని తెలిపారు కరుణ భూషణ్. అలాగే బాలకృష్ణకు భక్తి, ఆచారాలపై నమ్మకం ఎక్కువని, చాలా పంక్చువల్‌గా ఉంటారని కరుణ భూషణ్ పేర్కొన్నారు. 6 గంటల షూటింగ్ అంటే 5:45 గంటలకే మేకప్‌తో లొకేషన్‌లో సిద్ధంగా ఉంటారని, ఇది నేర్చుకోవాల్సిన విషయమని ఆమె అభిప్రాయపడ్డారు. ఒకసారి సెట్‌లో ఒంటరిగా కూర్చున్న తనను ఇక్కడికి రా, అందరితో కూర్చో అంటూ పిలిచారని, ఆయన అందరితోనూ కలివిడిగా ఉండరని, నచ్చిన వారితోనే ఉంటారని, ఆ అదృష్టం తనకు దక్కిందని కరుణ భూషణ్ అన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.