Jayasudha: తారలను వదలని మహామ్మారి.. సహజనటి జయసుధకు కరోనా..

దేశంలో కరోనా (Corona) మహామ్మారి మరోసారి ఉగ్రరూపం దాల్చుతుంది. రోజు రోజూకీ ఈ కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో కరోనా నియంత్రణ చర్యలను

Jayasudha: తారలను వదలని మహామ్మారి.. సహజనటి జయసుధకు కరోనా..
Jayasuda

Updated on: Feb 07, 2022 | 3:18 PM

దేశంలో కరోనా (Corona) మహామ్మారి మరోసారి ఉగ్రరూపం దాల్చుతుంది. రోజు రోజూకీ ఈ కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో కరోనా నియంత్రణ చర్యలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నప్పటికీ కోవిడ్ కేసులు మాత్రం పెరుగుతున్నాయి. ఇక సినీ పరిశ్రమలో కరోనా మహామ్మారి విజృంభిస్తుంది. ఇప్పటికే పలువురు సినీ తారలను కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి , మహేష్ బాబు, కీర్తి సురేష్, త్రిష, శోభన వంటి పలువురు సెలబ్రెటీలు కోవిడ్ బారీన పడి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

తాజాగా సహజనటి జయసుధ కరోనా బారీన పడ్డారు. చాలా రోజులుగా జయసుధ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె విదేశాల్లో ఉంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం సహజనటి జయసుధ కోవిడ్ బారిన పడ్డారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‏లో ఉన్నారని.. వైద్యుల సూచనలతో తగిన జాగ్రత్తలు తీసుకున్నంటున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో జయసుధ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు.

జయసుధ..  పద్నాగేళ్ల వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు .. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న జయసుధ.. ఇప్పటీ స్టార్ హీరోలకు తల్లిగా.. అక్కగా.. బామ్మగా నటిస్తూ.. ప్రేక్షకుల మనసులో చెరగని ముద్రవేశారు.

Also Read: Lata Mangeshkar: రాజ్‌కపూర్‌పై అలిగిన లతా మంగేష్కర్.. ఎందుకు అలా చేసిందంటే..

Lata Mangeshkar: అసంపూర్ణంగా మిగిలిపోయిన ప్రేమ వాళ్లది.. లతా మంగేష్కర్ ప్రేమ ద్వేషంగా ఎందుకు మారిందో తెలుసా..

Pawan Kalyan-Statue of Equality: సమతామూర్తి భగవద్ రామానుజాచార్య సన్నిధిలో ‘పవన్ కళ్యాణ్’.. చినజీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్న ‘జనసేనని’ ఫొటోస్..

Shruti Haasan: పచ్చని ప్రకృతి నడుమ ఫోటోలకు ఫోజులిచ్చిన ‘శ్రుతి హాసన్’ సొగసులు చూడతరమా..(ఫొటోస్)