Isha Koppikar: ఆ స్టార్ హీరో ఒంటరిగా రమన్నాడు.. షాకింగ్ కామెంట్స్ చేసిన చంద్రలేఖ హీరోయిన్..

ఇంకా పలువురు హీరోయిన్ కాస్టింగ్ కౌచ్ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ఇషా కొప్పికర్ ఓ స్టార్ హీరో తనను ఒంటరిగా రమ్మనాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఇషా కొప్పికర్.. దాదాపు 29 ఏళ్ల నాటి విషయాన్ని బయటపెట్టింది.

Isha Koppikar: ఆ స్టార్ హీరో ఒంటరిగా రమన్నాడు.. షాకింగ్ కామెంట్స్ చేసిన చంద్రలేఖ హీరోయిన్..
Isha Koppikar

Updated on: Jun 21, 2024 | 11:23 AM

సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి అనేక వార్తలు వినిపిస్తుంటాయి. ఇండస్ట్రీలో తమకు ఎదురైన అనుభవాల గురించి చాలా మంది హీరోయిన్స్ బహిరంగంగా మాట్లాడారు. అప్పట్లో మీటూ ఉద్యమం పేరుతో అనేక మంది తారలు తమకు ఎదురైన పరిస్థితులను బయటపెట్టారు. ఇప్పుడు అనేక ఇంటర్వ్యూలలో హీరోయిన్స్ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీలో ట్రెండ్ మారిన ఇంకా పలువురు హీరోయిన్ కాస్టింగ్ కౌచ్ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ఇషా కొప్పికర్ ఓ స్టార్ హీరో తనను ఒంటరిగా రమ్మనాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఇషా కొప్పికర్.. దాదాపు 29 ఏళ్ల నాటి విషయాన్ని బయటపెట్టింది.

ఇషా కొప్పికల్ చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఫిజా సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఇషా కొప్పికర్ హిందీతోపాటు తెలుగు చిత్రాల్లో నటించింది. అక్కినేని నాగార్జున నటించిన చంద్రలేఖ సినిమాలో కనిపించింది. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఈ సినిమా తర్వాత కాంటేలోని ఇష్క్ సముందర్ కంపెనీలోని ఖల్లాస్ వంటి స్పెషల్ సాంగ్స్ చేసింది. ఇన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఇషా కొప్పికర్.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇషా కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

“నిజం చెప్పాలంటే నువ్వేం చేయగలవు అని ఇక్కడ ఎవరు చూడరు. మీరేం అనుకుంటున్నారనేది కూడా దర్శకులు అడగరు. హీరోయిన్స్ ఏమి చేయాలనేది కేవలం హీరోలు మాత్రమే నిర్ణయిస్తారు. ఒకవేళ మీరు విలువలను నమ్ముతూ ఉంటే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. క్యాస్టింగ్ కౌచ్ భయంతో ఇండస్ట్రీకి దూరమైన అమ్మాయిలు ఎందరో ఉన్నారు. కొన్ని పనులు అమ్మాయిలు ఒప్పుకోవాలి. లేదంటే సినిమాలను వదులుకునే పరిస్థితులను సృష్టిస్తారు. ఇండస్ట్రీలోని ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొని నిలబడిన అమ్మాయిలు ఉన్నారు. 18 ఏళ్ల వయసులో ఒక నటుడు నా దగ్గరకు వచ్చి తనతో స్నేహంగా ఉండాలని.. అప్పుడే అవకాశాలు వస్తాయని చెప్పారు. నేను అందరితే స్నేహపూర్వకంగానే ఉంటాను. నిర్మాత ఏక్తా కపూర్ నేను కొంచం యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలని చెప్పింది” అంటూ చెప్పుకొచ్చింది.

“సినీ పరిశ్రమలో చాలా మంది అనుచితంగా తాకేవారు. అలాగే అప్పట్లో ఓ స్టార్ హీరో తనను ఒంటరిగా కలవడానికి రమ్మన్నాడు. అంతేకాదు.. నా వెంట డ్రైవర్ కూడా ఉండకూడదని చెప్పాడు. ఒంటరిగా రావాలని నిర్మాతలు కూడా చాలాసార్లు పిలిచారు. హీరోలతో కచ్చితంగా స్నేహం చేయాల్సి వచ్చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే స్నేహంగా ఉండాలని ఆ పెద్ద స్టార్ హీరో చెప్పారని” చెప్పుకొచ్చింది ఇషా కొప్పికర్.