Ileana: మొత్తానికి ప్రియుడి ఫోటో షేర్ చేసిన ఇలియానా.. ఇంతకీ అతను ఎవరంటే..

|

Jul 02, 2023 | 5:45 PM

చాలా కాలం నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఇలియానా.. ప్రెగ్నెన్సీ అంటూ ఫోటోస్ షేర్ చేసి అభిమానులకు షాకిచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ బేబీ బంప్ పిక్స్ షేర్ చేస్తూ.. తన బిడ్డ కోసం వెయిట్ చేస్తున్నానంటుంది.

Ileana: మొత్తానికి ప్రియుడి ఫోటో షేర్ చేసిన ఇలియానా.. ఇంతకీ అతను ఎవరంటే..
Ileana
Follow us on

ఇలియానా.. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. వరుస సినిమాలతో అగ్రకథానాయికగా కొనసాగిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. హిందీలో ఎన్నో సూపర్ హిట్స్ మూవీస్ చేసిన ఈ బ్యూటీ సడెన్ గా సినిమాలకు దూరమయ్యింది. చాలా కాలం నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఇలియానా.. ప్రెగ్నెన్సీ అంటూ ఫోటోస్ షేర్ చేసి అభిమానులకు షాకిచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ బేబీ బంప్ పిక్స్ షేర్ చేస్తూ.. తన బిడ్డ కోసం వెయిట్ చేస్తున్నానంటుంది. అయితే పెళ్లి చేసుకోకుండానే ప్రెగ్నెన్సీ అంటూ ఇలియానా చెప్పడంతో ఇండస్ట్రీలో టాపిక్ గా మారింది. ఇప్పటివరకు తన భర్త ఎవరు అనేది బయటపెట్టలేదు ఇలియానా. ఇటీవల తన ఎంగెజ్మెంట్ రింగ్స్ పిక్స్ షేర్ చేస్తూ తన భర్త గురించి ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఇక ఇప్పుడు మొదటిసారి తన ప్రియుడి ఫోటో షేర్ చేసింది ఈ గోవా బ్యూటీ.

ఆమె ఇన్ స్టాలో కుక్కపిల్ల ఫోటోను షేర్ చేస్తూ.. దానికి ముద్దుపెడుతున్న తన ప్రియుడి ఫోటోను కూడా నెట్టింట షేర్ చేసింది. అయితే ఆ ఫోటోలో అతను ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది. దీంతో ఇలియానా తన  ప్రియుడిని పరిచయడం చేయడంలో ఎప్పటికప్పుడు సస్పెన్స్ క్రియేట్ చేసింది.

ఇవి కూడా చదవండి

Ileana 1

ఇదిలా ఉంటే.. గతంలో ఇలియానా.. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్ తో ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూసింది. అయితే ఈ వార్తలపై వీరిద్దరు స్పందించలేదు. ఇక ఇలియానా చివరిసారిగా అభిషేక్ బచ్చన్ తో కలిసి ది బిగ్ బుల్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం మూవీస్ నుంచి బ్రేక్ తీసుకుంది ఈ బ్యూటీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.