హానీరోజ్.. కొన్నాళ్ల క్రితం ఈ పేరు అసలు తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని పేరు. కానీ నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. గతేడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో బాలయ్య సరసన నటించింది. అంతకు ముందే హానీరోజ్ తెలుగులో ఓ సినిమా చేసినా.. అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ వీరసింహా రెడ్డి సినిమాతో కథానాయిగా ఫుల్ క్రేజ్ అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత తెలుగులో మరో మూవీ అనౌన్స్ చేయలేదు. కానీ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ అంటూ తెగ హడావిడి చేసింది. అలాగే సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న స్టార్. కొద్దిరోజుల క్రితం షాపింగ్ మాల్ ఓపెనింగ్ వేడుకలలో తెగ సందడి చేసిన హానీ.. ఇప్పుడు సైలెంట్ అయ్యింది.
తాజాగా హనీ రోజ్ స్కూల్ డేస్ ఫోటో నెట్టింట వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో హనీ రోజ్ ఎక్కడ ఉందో కనిపెట్టగలరా ?.. సరే మేమే చెప్పేస్తాం.. ఆ ఫోటోలో ఎల్లో సారీ టీజర్ కు కుడి పక్కన నిలబడి ఉన్న అమ్మాయిలలో హానీ ఫస్ట్ ఉంది. వినయనేర దర్శకత్వం వహించిన ‘బాయ్‌ఫ్రెండ్’ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. రువాత, హనీ త్రివేండ్రం లాడ్జ్, కనల్, వారి రాత్రులు, గాడ్స్ ఓన్ క్లీటస్, చంక్స్, యు టూ బ్రూటస్, ఇట్టిమని: మేడ్ ఇన్ చైనా, బిగ్ బ్రదర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది.
హనీ రోజ్ ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో యాక్టివ్‌గా ఉంది. తెలుగులో నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. కానీ ఆ తర్వాత మళ్లీ సినిమా ప్రకటించలేదు. హనీ నటించిన తాజా చిత్రం ‘రేచెల్’ షూటింగ్ జరుపుకుంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.