ఒకేఒక్క సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనస్సులో స్థానం సంపాదించుకుంది అందాల భామ హానీ రోజ్. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది హనీరోజ్. ఆ సినిమాలో తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. వీరసింహారెడ్డి సినిమా తర్వాత మరో తెలుగు సినిమాలో నటించలేదు హనీరోజ్. ప్రస్తుతం ఆమె ఓ పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. సినిమాలకు దూరంగా ఉంటున్న హనీరోజ్ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, రకరకాల వీడియోలతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా హనీరోజ్ లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ నివేదిక వెలువడిన తర్వాత నటీనటులపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీని తరువాత, ఈ సమస్యపై స్పందించడానికి సినీ తారలు చాలా మంది ముందుకు వచ్చారు. కొంతమంది తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి దైర్యంగా మాట్లాడుతున్నారు.. ఇప్పుడు హనీ రోజ్ కూడా దీని పై స్పందించింది. మలయాళ సినిమాలో లైంగికవేధింపులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని హనీరోజ్ తెలిపింది. ఓ ప్రైవేట్ ఫంక్షన్ నుంచి తిరిగి వస్తుండగా హనీ రోజ్ మీడియాతో మాట్లాడింది.
మలయాళ చిత్రసీమలో లైంగిక వేధింపుల అలాగే దోపిడీకి పాల్పడిన వారిని శిక్షించాల్సిందేనని హనీ రోజ్ భావిస్తున్నట్లు తెలిపింది. అయితే అలా చేసిన వారిని మన చట్టం ప్రకారం శిక్షించాలి. కానీ అవన్నీ జరగవు కదా.! అని హనీరోజ్ అన్నారు. అలాగే తాను నటించిన సెట్స్‌లో ఎలాంటి లైంగిక వేధింపులు జరగలేదు. అలాగే ఇతరులకు కూడా జరిగినట్టు తనకు తెలియదని హనీరోజ్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హనీరోజ్ రాచెల్ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా టీజర్ గతంలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.