నాకు ఎక్కువగా అలాంటి పాత్రలే వస్తున్నాయి.. నటి హరితేజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో హరితేజ ఒకరు. ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ సినిమాతో పాపులర్ అయ్యింది హరితేజ. ఆతర్వాత బిగ్ బాస్ 1తో క్రేజ్ తెచ్చుకుంది.
తెలుగు ప్రేక్షకులకు హరితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీరీయల్స్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈమె.. పలు టీవీషోలో కనిపించి మెప్పించింది. అలాగే సినిమాలతో పాటు బిగ్ బాస్ గేమ్ షోలోనూ కనిపించి ఆకట్టుకుంది. మనసు మమత, రక్త సంబంధం, అభిషేకం, తాళి కట్టు శుభవేళ, శివరంజని, కన్యాదానం ఇలా పలు సీరియల్స్ లో నటించింది హరితేజ. అలాగే సినిమాల్లోనూ చక్కటి పాత్రలు చేసి మెప్పించింది. ముఖ్యంగా అ ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమాతో వెండితెర పై మంచి గుర్తింపు తెచ్చుకుంది హరితేజ. ఈ సినిమాలో హీరోయిన్ సమంత పనిమనిషిగా నటించింది. అలాగే తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంది హరితేజ.
ఇక ఆతర్వాత ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్ గా పాల్గొంది. బిగ్ బాస్ లో తన ఆటతో పాటు అల్లరితో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ క్రేజ్ తోనే ఆతర్వాత కొన్ని సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. అలాగే బిగ్ బాస్ సీజన్ 8లోనూ పాల్గొంది హరితేజ. కాగా ఇప్పుడు సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అంతే కాదు ఈ అమ్మడు గ్లామర్ గేట్లు ఎత్తేసి అందాలతో ఆకట్టుకుంటుంది.
ప్రస్తుతం లేచింది మహిళా లోకం అనే సినిమాలో నటిస్తుంది హరితేజ. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ లో ఆమె మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు చాలా సినిమాల్లో పనిమనిషి పాత్రల్లోనే కనిపిస్తున్నారు. దానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా.? అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆమె ఆసక్తికర సమాధానం తెలిపారు. ఆ పాత్రకు తాను బ్రాండ్ అంబాసిడర్‌లా మారిపోయానని సరదాగా అన్నారు హరితేజ, కాగా చాలా మంది రచయితలు ఆ పాత్రలు రాస్తున్నప్పుడు నన్నే ఊహించుకుని రాస్తున్నారు. వాళ్లు ఆలోచన మార్చితే నా పాత్రలు కూడా మారుతాయి చెప్పుకొచ్చింది హరితేజ. అలాగే తాను ఇటీవలే వేరే పాత్రలు కూడా చేశానని తెలిపింది.. అయితే ఒక పాత్రతో ముద్రపడితే దాన్ని మార్చుకోవడం కష్టమే.. జనాలకు అలానే ముద్రపడిపోతాము.. ఇక పై ఇలాంటి పాత్రలు తగ్గిపోవచ్చు అని తెలిపింది హరితేజ. అదేవిధంగా ఒకేరకమైన పాత్రలు చేయాలని నేను ఎప్పుడూ ఫిక్స్ అవ్వను.. ఏపాత్ర వచ్చినా దానికి న్యాయం చేయాలనే చూస్తాను.. ఇతర పాత్రలు వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలిపింది హరితేజ.