AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను నీలా కాదు బ్రో..! ట్రోల్స్ ఎఫెక్ట్.. లైవ్‌లో కన్నీళ్లు పెట్టుకున్న టాలీవుడ్ హీరోయిన్

టాలీవుడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2021లో జాతిరత్నాలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీలో చిట్టి పేరుతో మరింత పాపులర్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకుంది .

నేను నీలా కాదు బ్రో..! ట్రోల్స్ ఎఫెక్ట్.. లైవ్‌లో కన్నీళ్లు పెట్టుకున్న టాలీవుడ్ హీరోయిన్
Fariaabdullah
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Aug 15, 2026 | 10:24 PM

Share

హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల హైదరాబాద్ పాతబస్తీ బోనాల వేడుకల్లో పాల్గొన్న ఫరియాను కొందరు నెటిజన్లు మతపరమైన అంశాలను ప్రస్తావిస్తూ ట్రోల్ చేశారు. తనపై వస్తున్న కామెంట్లపై స్పందించిన ఫరియా.. సెల్ఫీ వీడియో ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల హైదరాబాద్‌ పాతబస్తీ లో జరిగిన బోనాల వేడుకల్లో ఫరియా అబ్దుల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సందడి చేసిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆమె బోనాల వేడుకల్లో పాల్గొనడాన్ని తప్పుబడుతూ కొందరు నెటిజన్లు మతపరమైన కోణంలో కామెంట్లు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై ఫరియా స్వయంగా స్పందించారు.

తనను ట్రోల్ చేస్తున్న వారికి ఫరియా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో దేవుడిని చూడడమే అసలైన భక్తి అని చెప్పారు. మనసులో ద్వేషాన్ని పెంచుకుంటూ దేవుడిని వెతికితే అది సరైన మార్గం కాదని అభిప్రాయపడ్డారు. దేవుడు ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో పరిమితమైన వ్యక్తి కాదని.. ప్రతిచోటా విస్తరించి ఉండే దివ్యమైన వెలుగు అని ఫరియా పేర్కొన్నారు. అంతటి విశాలమైన మత భావనను సంకుచితమైన ఆలోచనలతో ఎలా పరిమితం చేస్తారని ప్రశ్నించారు.

తనపై వస్తున్న ట్రోలింగ్‌తో బాధపడకుండా.. ద్వేషానికి ప్రేమతోనే సమాధానం ఇస్తానని ఫరియా స్పష్టం చేశారు. “నాపై ద్వేషం చిమ్మేవారికి నేను మరింత ప్రేమను పంచుతాను” అనే భావనతో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెటిజన్ల మధ్య చర్చకు దారితీశాయి.  సినిమాలతో పాటు తన డ్యాన్స్, ప్రత్యేకమైన స్టైల్‌తో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఫరియా అబ్దుల్లా.. ఇప్పుడు బోనాల వేడుకలు, ఆ తర్వాత వచ్చిన ట్రోలింగ్‌పై చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఫరియా వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us