Erica Fernandes: చాలా అవమానించారు.. నా ఛాన్స్‌లు కూడా లాగేసారు..

వివిధ కారణాలతో ఇబ్బందులు పడిన వారు కూడా అంతే ఉన్నారు. చాలా మంది ఇప్పటికే మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి తెలిపారు. క్యాస్టింగ్ కౌచ్ పై చాలా మంది హీరోయిన్స్ షాకింగ్ విషయాలు చెప్పారు. తాజాగా ఓ నటి కూడా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి చెప్పి షాక్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు ఎరికా ఫెర్నాండేజ్..

Erica Fernandes: చాలా అవమానించారు.. నా ఛాన్స్‌లు కూడా లాగేసారు..
Erica Fernandes
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 02, 2024 | 8:10 AM

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం.. చాలా మంది ఇండస్ట్రీ పై ఆసక్తితో సొంత ఊర్లు వదిలిపెట్టి వస్తుంటారు. అయితే ఇక్కడ ఎదిగిన వారు ఎంతమంది ఉన్నారో.. అవకాశాలు అందుకోలేక.. వివిధ కారణాలతో ఇబ్బందులు పడిన వారు కూడా అంతే ఉన్నారు. చాలా మంది ఇప్పటికే మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి తెలిపారు. క్యాస్టింగ్ కౌచ్ పై చాలా మంది హీరోయిన్స్ షాకింగ్ విషయాలు చెప్పారు. తాజాగా ఓ నటి కూడా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి చెప్పి షాక్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు ఎరికా ఫెర్నాండేజ్.. మోడలింగ్ నుంచి నటిగా మారింది ఈ చిన్నది. టీవీ సీరియల్స్ లో నటించి ఆతర్వాత సినిమాల్లోకి వచ్చింది ఈ అమ్మడు.

అంతే కాదు మోస్ట్ గ్లామరస్ బ్యూటీగా అవార్డులు కూడా అందుకుంది. తెలుగులోనూ నటించి మెప్పించింది ఈ చిన్నది. గాలిపటం, డేగ సినిమాల్లో నటించి మెప్పించింది ఎరికా ఫెర్నాండేజ్. అలాగే హిందీలోనూ బబ్లూ హ్యాపీ హై అనే సినిమాలోనూ నటించింది. తాజాగా ఈ బ్యూటీ షాకింగ్ కామెంట్స్ చేసింది. నేపోటిజం వల్ల తనకు అవకాశాలు రాలేదు అని తెలిపింది ఎరికా ఫెర్నాండేజ్.

సెలబ్రిటీ కిడ్స్‌ తనకు అవకాశాలు రాకుండా చేశారు అని ఆవేదన వ్యక్తం చేసింది. సౌత్ ఇండస్ట్రీలో నాకు సినిమా ఛాన్స్ వచ్చింది.. రెండు రోజులు షూటింగ్ తర్వాత నన్ను తీసేశారు. దాంతో నేను బాలీవుడ్ లో ఎందుకు సినిమాలు చెయ్యకూడదు అని అక్కడ ట్రై చేశా.. చాలా ఆడిషన్స్ కు వెళ్ళా.. ఆల్మోస్ట్ ఓకే అయ్యేది కానీ ఫెమస్ హీరోయిన్స్ కూతుర్లను సెలక్ట్ చేసే వారు అని తెలిపింది. చాలా బాధపడ్డా.. అవకాశాలు లేక సీరియల్స్ చేశాను. ఎందుకు సీరియల్స్ చేస్తున్నావ్ అందరూ నన్ను అడిగారు. గతంలో నేను ఎంతో బాధలను అనుభవించా..  నేను సన్నగా ఉన్నానని చాలా సినిమా ఛాన్స్ లు మిస్ అయ్యాయి. డిప్రషన్ కు వెళ్లా.. ఆ అవమానాల వల్లే నేను మరింత స్ట్రాంగ్ అయ్యాను అని తెలిపింది ఈ చిన్నది.

View this post on Instagram

A post shared by Erica J Fernandes (@iam_ejf)

ఎరికా ఫెర్నాండేజ్ ఇన్ స్టా గ్రామ్

View this post on Instagram

A post shared by Erica J Fernandes (@iam_ejf)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.