Viral Photo: అమ్మ పక్కన అందంగా కూర్చున్న ఈ చిన్నది.. ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఎవరో కనిపెట్టారా..?

చిన్నప్పుడు అలా ఉంది కానీ ఇప్పుడు సో హాట్ అబ్బా. ఆమె కనిపిస్తే కన్ను ఆర్పాలనిపించదు. మైండ్‌ని ఇట్టే డిస్టబ్ చేసేస్తది. ఫోన్‌లో తన ఫోటోనే వాల్ పేపర్ పెట్టుకోవాలనిపిస్తది.

Viral Photo: అమ్మ పక్కన అందంగా కూర్చున్న ఈ చిన్నది.. ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఎవరో కనిపెట్టారా..?
Actress Childhood Photo

Updated on: Dec 21, 2022 | 7:34 PM

ఏదైనా ఆకేషన్ వస్తే చాటు సెలబ్రిటీలు తమ చైల్డ్‌హుడ్  ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. అవి నిమిషాల్లో నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. అయితే కొంతమంది స్టార్స్‌ చిన్ననాటి ఫోటోలను చూసినప్పడు.. వారు వీరేనా అని అనిపిస్తుంది. అలాంటి ఓ క్రేజీ ఫోటో మీ ముందుకు తీసుకొచ్చాం. ఈమె యాపిల్ బ్యూటీ. ఇట్ మీన్స్ యాపిల్ పండు రంగులో ఉంటుంది. ముట్టుకుంటే కంది పోతుందేమో అనిపిస్తుంది. కుర్రాళ్ల అయితే ఆమె కోసం వెర్రెక్కిపోతారు. ఆమె వాలు కళ్ల చూపు తాకితే చాలని ఆరాటపడుతూ ఉంటారు. అమ్మాయిలు అయితే ఆమె మేను ఛాయ చూసి.. అసూయ పడుతూ ఉంటారు. ఏంటి ఇంత ఇంట్రో ఇచ్చినా కనిపెట్టలే..? మరో క్లూ. దివి నుంచి దిగివచ్చావా యాపిల్ బ్యూటీ.. నిను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ అని అనాలనిపిస్తుంది ఆమెను చూస్తే. ఈ క్లూతో పక్కాగా కనిపెట్టేసి ఉంటారు.

యస్..  షీ ఈజ్ దివి. బిగ్ బాస్ ఫేమ్ దివి. మహేష్‌ బాబు హీరోగా వచ్చిన ‘మహర్షి’ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించిన నటి దివి..  బిగ్‌బాస్‌ 4 ద్వారా మస్త్ పాపులారిటీ తెచ్చుకుంది.  ఆ తర్వాత  మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాలో ఛాన్స్ అందుకుని.. తనలోని టాలెంట్ ఫ్రూవ్ చేసుకుంది. ప్రజంట్ ఆమె హీరోయిన్‌గా నటించిన 2 సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. చొట్ట బుగ్గలు, కవ్వించే కళ్లతో .. యూత్‌ను మాయ చేసే ఈ చిన్నదానికి ఇన్ స్టాలో దాదాపు 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఆమె పోస్ట్ చేసే వీడియోలో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతాయి.

కాగా గతంలో తన తల్లితో ఉన్న చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది దివి. అవి నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈమె దివినా అని చాలామంది నోరెళ్లబెడుతున్నారు. అమ్మ అందమే తనకి వచ్చిందని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. మీ అమ్మను ఆనందంగా ఉంచాలంటే.. నాకు ఆమెని అత్తని చెయ్ అని దివి ఆరాధించే మరో నెటిజన్ వ్యాఖ్య చేశాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి