
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబోలో రాబోయే ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా.. భారీ బడ్జెట్ తో వరల్డ్ వైడ్ లెవల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటికే జనాల్లో ఓ రేంజ్ హైప్ నెలకొంది. ఇదిలా ఉంటే.. గతంలో మహేష్ బాబుకు తల్లిగా నటించనని ఓ హీరోయిన్ తెగేసి చెప్పిందట. కానీ ఆ తర్వాత డైరెక్టర్ చెప్పిన కథ నచ్చడంతో ఆ పాత్ర చేసేందుకు ఒప్పుకుందట. ఆమె మరెవరో కాదు.. ఒకప్పటి హీరోయిన్ దేవయాని. తెలుగుతోపాటు తమిళంలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. 90 – 2000 ప్రారంభంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో కథానాయికగా నటించి మెప్పించింది. 1993లో విడుదలైన బెంగాలీ చిత్రం షాట్ పొంచోమితో ఆమె సినిమాల్లోకి ప్రవేశించింది. తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం మూవీలో హీరోయిన్ గా కనిపించింది. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు భాషలలో పలు చిత్రాల్లో కనిపించింది.
అయితే పెళ్లి తర్వాత హీరోయిన్‌గా నటించడం తగ్గించేసింది. ఇక ఇప్పుడు సహాయ నటిగా కొనసాగుతుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దేవయాని తెలుగు సినీప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. డైరెక్టర్ ఎస్ జే సూర్య దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన చిత్రం నాని. ఈ సినిమాలో మహేష్ తల్లిగా నటించాలని ఎస్జే సూర్య కోరారట. కానీ అందుకు దేవయాని ఒప్పుకోలేదట. తల్లి పాత్ర తనకు వద్దని చెప్పిందట. ఆ తర్వాత ఎస్జే సూర్య పది నిమిషాల్లో తన ఇంటికి వచ్చి సినిమా కథతోపాటు తన పాత్ర గురించి వివరించాడని.. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని నటించి చూపించాడని.. కథ తనకు నచ్చేలా చెప్పి నటించాలని అడిగాడని చెప్పుకొచ్చింది.
ఆ విధంగా తాను నాని సినిమాలో మహేష్ బాబు తల్లిగా నటించినట్లు తెలిపింది. అదే సినిమాను తమిళంలో రీమేక్ చేయగా.. తాను మళ్లీ తల్లిపాత్రను పోషించినట్లు చెప్పుకొచ్చింది. అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ తల్లిగా కనిపించింది దేవయాని. అలాగే ఇప్పుడు తెలుగు, తమిళం భాషలలో సహయ నటిగా కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి :
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..
Tollywood: 2001 విమాన ప్రమాదంలో ఆ స్టార్ హీరో.. భుజం విరిగిపోయిన వారందరిని కాపాడి.. చివరకు..
Ramyakrishna: ఆ ఒక్క హీరోకి కూతురిగా, చెల్లిగా, భార్యగా నటించిన రమ్యకృష్ణ.. ఇంతకీ అతడు ఎవరంటే..
Tollywood: సీరియల్లో పద్దతిగా.. బయట బీభత్సంగా.. ఈ హీరోయిన్ గ్లామర్ ఫోజులు చూస్తే మెంటలెక్కిపోద్ది..