Daaku Maharaaj: బాలయ్య డాకు మహారాజ్‌లో ఆకట్టుకున్న షార్ట్ ఫిలిం బ్యూటీ.. ఎవరో తెలుసా..?

|

Jan 14, 2025 | 2:56 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా నేడు థియేటర్స్ లోకి వచ్చేసింది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చింది. విడుదలకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.

Daaku Maharaaj: బాలయ్య డాకు మహారాజ్‌లో ఆకట్టుకున్న షార్ట్ ఫిలిం బ్యూటీ.. ఎవరో తెలుసా..?
Daaku Maharaaj
Follow us on

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ డాకు మహారాజ్. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తొలి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. తొలి రోజే రూ. 56 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి బాలయ్య స్టామినా ఏంటో చూపించింది. ఇక రెండో రోజు కూడా భారీగానే రాబట్టింది ఈ సినిమా.. బాలకృష్ణ వరుస విజయాలతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. ఇప్పుడు డాకు తో మరోసారి సంక్రాంతి పండగ తనదే అని నిరూపించారు బాలయ్య. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్య జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా హీరోయిన్స్ గా నటించారు. వీరితో పాటు ఓ షార్ట్ ఫిలిం బ్యూటీ కూడా సినిమాలో నటించింది. ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : ఏంటీ..! మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నది ఇప్పుడు స్టార్ హీరోయినా.! అదికూడా తెలుగమ్మాయి

డాకు మహారాజ్ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో అదరగొట్టారు. బాబీ ఈ సినిమాను అభిమానుల ఊహకు మించి తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. మాస్ ఆడియన్స్ కు కావాల్సిన మసాలా మొత్తం ఈ సినిమాలో దట్టించారు బాబీ. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ తో పాటు మరో భామ కూడా నటించింది ఆమె చాందిని చౌదరి. షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అలా వచ్చిన వారిలో చాందిని చౌదరి ఒకరు. హీరోయిన్ గా ఆచి తూచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఇది కూడా చదవండి :Srihari: వాడు నా అయ్య..! శ్రీహరి నాన్న అని పిలిచే ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా.?

హీరోయిన్ గా చేయకముందు పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, కేటుగాడు, బ్రహ్మోత్సవం సినిమాల్లో చిన్న రోల్స్ చేసింది. ఆ తర్వాత కుందనపుబొమ్మ సినిమాతో హీరోయిన్ గా మారింది. అలాగే కలర్ ఫోటో సినిమాతో పేక్షకులను మెప్పించింది. కలర్ ఫోటో సినిమాలో చాందిని చౌదరి తన నటనతో ఆకట్టుకుంది.  ఈ మూవీ తర్వాత చాందిని చౌదరికి వరుస ఆఫర్స్ వస్తాయని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దాంతో ఈ బ్యూటీ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా లేదా చిన్న రోల్స్ లో కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు బాలయ్య డాకు మహారాజ్ సినిమాలోనూ మెరిసింది ఈ ముద్దుగుమ్మ.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి