Chandini Chowdary: ఆడాళ్ళను క్యారెక్టర్ లేని వాళ్లలా ఎందుకు చూస్తారు.? చాందిని చౌదరి కామెంట్స్

హీరోయిన్ గా చేయకముందు పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, కేటుగాడు, బ్రహ్మోత్సవం సినిమాల్లో చిన్న రోల్స్ చేసింది. ఆతర్వాత కుందనపుబొమ్మ సినిమాతో హీరోయిన్ గా మారింది. అలాగే కలర్ ఫోటో సినిమాతో పేక్షకులను మెప్పించింది. కలర్ ఫోటో సినిమాలో చాందిని చౌదరి తన నటనతో ఆకట్టుకుంది.

Chandini Chowdary: ఆడాళ్ళను క్యారెక్టర్ లేని వాళ్లలా ఎందుకు చూస్తారు.? చాందిని చౌదరి కామెంట్స్
Chandini Chowdary

Updated on: Jun 22, 2024 | 3:24 PM

షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అలా వచ్చిన వారిలో చాందిని చౌదరి ఒకరు. హీరోయిన్ గా ఆచి తూచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హీరోయిన్ గా చేయకముందు పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, కేటుగాడు, బ్రహ్మోత్సవం సినిమాల్లో చిన్న రోల్స్ చేసింది. ఆ తర్వాత కుందనపుబొమ్మ సినిమాతో హీరోయిన్ గా మారింది. అలాగే కలర్ ఫోటో సినిమాతో పేక్షకులను మెప్పించింది. కలర్ ఫోటో సినిమాలో చాందిని చౌదరి తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత చాందిని వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. రీసెంట్ గా విష్వక్ సేన్ గామీ తో పాటుగా లేటెస్ట్ గా వచ్చిన యేవమ్, మ్యూజిక్ షాప్ మూర్తి చిత్రాలతో ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే తాజాగా చాందిని ఓ ఆసక్తికర కామెంట్స్ చేసింది. సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్ట్ ను షేర్ చేసింది. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సినీఇండస్ట్రీలో పనిచేసే ఆడవాళ్లను.. మగాళ్లు ఎందుకు క్యారెక్టర్ లేని వారిలా చూస్తారు? అంటూ ప్రశ్నించింది చాందిని చౌదరి. ఈ పోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి కళాఖండంరా బాబు..! ఇండియాలోనే అతి పెద్ద డిజాస్టర్‌ మూవీ ఇదే

“నేను ఇండస్ట్రీలో చూసిన దాని ప్రకారం.నిజాయితీగా ఓ ప్రశ్న మీ అందరిని అడుగుతున్నాను. ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే ఆడవారిని మగాళ్లు ఎందుకు క్యారెక్టర్ లేని వాళ్లలా చూస్తారు? వాళ్లు మాట్లాడే ప్రతీమాటలో ఆడవాళ్లను తక్కువ చేసే మాట్లాడతారు. అది ఎంతో బాధ కలిగిస్తోంది. ఎందుకంటే.? ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పని చేయాలి. అలాంటప్పుడు ఇలాంటివి చూస్తే మనసు విరిగిపోతుంది” అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చింది చాందిని. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో.. అలాగే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

చాందిని చౌదరి ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.