
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది పంజాబీ ముద్దుగుమ్మ భూమిక చావ్లా. పవన్ కళ్యాణ్ సరసన ‘ఖుషి’, మహేష్ బాబుతో ‘ఒక్కడు’, జూనియర్ ఎన్టీఆర్‌తో ‘సింహాద్రి’ వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి సెకండ్ ఇన్నింగ్స్ కూడా సక్సెస్‌ఫుల్‌గా సాగిస్తోంది. తాజాగా ఈ సీనియర్ నటి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వీడియోతో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఇటీవల హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భూమిక తన కొడుకుతో కలిసి కెమెరా కంటికి చిక్కింది. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తెగ వైరల్ అవుతోంది. అందులో భూమిక తన కొడుకుతో కలిసి నడుచుకుంటూ వస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. “ఏంటీ.. భూమికకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా.. ?” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికీ ఎంతో ఫిట్‌గా, యంగ్‌గా కనిపించే భూమిక పక్కన దాదాపు ఆమె ఎత్తుకు సమానంగా ఎదుగుతున్న బాబును చూసి అభిమానులు షాక్‌కు గురవుతున్నారు.
భూమిక చావ్లా 2007లో తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్, ప్రముఖ యోగా టీచర్ అయిన భరత్ ఠాకూర్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఈ దంపతులకు 2014లో ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాబు పేరు యష్. ప్రస్తుతం యష్‌కు దాదాపు 12 ఏళ్లు. ఎప్పుడూ తన వ్యక్తిగత విషయాలను, కుటుంబ విశేషాలను పెద్దగా బయటకు రానివ్వని భూమిక.. ఇలా హఠాత్తుగా ఎయిర్‌పోర్ట్‌లో తన కొడుకుతో కనిపించేసరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఈ వైరల్ వీడియోలో భూమిక చాలా సింపుల్ లుక్‌లో కనిపించగా, ఆమె కుమారుడు యష్ ఎంతో క్యూట్‌గా, బొద్దుగా, అమ్మతో కలిసి వస్తూ కనిపించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు “సమయం ఎంత వేగంగా గడిచిపోయింది! నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోయిన్‌గా చూసిన భూమికకు అప్పుడే ఇంత పెద్ద కొడుకు వచ్చేసాడా” అంటూ నోరెళ్లబెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్ట్ విజువల్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.