
హీరోయిన్స్ చాలా మంది తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని తపన పడుతుంటారు. ఛాలెంజింగ్ రోల్స్ వస్తే తమ సత్తా చాటాలని ఎప్పుడు ఎదురుచూస్తుంటారు. మరికొంతమంది గ్లామర్ రోల్స్ చేస్తూ ఆడియన్స్ ను మెప్పిస్తున్నారు. తాజాగా ఓ ముద్దుగుమ్మ వరుసగా సినిమాలు చేయడం కంటే ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయడమే ముఖ్యం అంటుంది ఆ ముద్దుగుమ్మ. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు ఆషికా రంగనాథ్ ఎక్కువగా కన్నడ సినిమాల్లో నటిస్తూ పాపులర్ అయ్యింది. ఆతర్వాత తెలుగు, తమిళ చిత్రాలలో కూడా కనిపించింది. ఈముద్దుగుమ్మ 1996 ఆగస్టు 5న కర్ణాటకలోని తుమకూరులో రంగనాథ్, సుధా రంగనాథ్ దంపతులకు జన్మించింది. ఈ అమ్మడికి అనూషా రంగనాథ్ అనే అక్క ఉంది, ఆమె కూడా కన్నడ చిత్రాలలో నటించి మెప్పించింది. ఆషికా ఫ్రీస్టైల్, బెల్లీ డ్యాన్స్, వెస్ట్రన్ డ్యాన్స్‌లో శిక్షణ పొందింది. 2014లో క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగుళూరు పోటీలో రన్నర్-అప్‌గా నిలిచింది.
ఆషికా 2016లో కన్నడ చిత్రం క్రేజీ బాయ్తో సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రంలో ఈ చిన్నదాని నటనకు సైమా అవార్డ్‌లో ఉత్తమ డెబ్యూ నటిగా నామినేషన్ లభించింది. ఆ తర్వాత రాంబో 2 , రేమో, మధగజ చిత్రాలలో నటించింది. మధగజ చిత్రానికి ఆమె సైమా ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. 2023లో నందమూరి కల్యాణ్ రామ్ సరసన అమిగోస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత నాగార్జునతో నా సామిరంగ (2024)లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ప్రస్తుతం ఆషికా చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రంలో కూడా నటిస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా ఆషిక చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆషిక మాట్లాడుతూ సినిమాల్లో నటించడం కంటే నాకు పాత్రలే ముఖ్యం అంటుంది. హీరోయిన్‌గా అవకాశాలు రావడం ఒక ఎత్తైతే వచ్చిన ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపంచాలనేదే నా కోరిక. స్టార్ హీరోల సినిమాల్లో నటించడం కంటే.. తన ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో మెరవడం ముఖ్యం అంటూ చెప్పుకొచ్చింది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది ఈ చిన్నది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.