
మారుతున్న జనరేషన్స్ కు తగ్గట్టుగా సినిమాల్లోనూ ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. హీరోయిన్ అంటే కేవలం పాటల కోసమే కాదు అని చాలా మంది హీరోయిన్స్ నిరూపించారు. పాత్రలకు ప్రాణం పోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేసి ఆకట్టుకుంటున్నారు. హీరోలకు సమానంగా యాక్షన్స్ సీన్స్ లోనూ నటించి మెప్పిస్తున్నారు. అలాగే ఛాలెంజింగ్ రోల్స్ లో నటించి అలరిస్తున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తే ఎగిరి గంతేసి ఒప్పేసుకుంటున్నారు. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ తాను చేసిన ఓ ఛాలెంజింగ్ పాత్ర తెలిపింది. ఓ సినిమా మొత్తం తాను జాకెట్ లేకుండా నటించా అని తెలిపింది. చీరకట్టులో బ్లౌజ్ లేకుండా నటించా అని తెలిపింది. ఆ హీరోయిన్ ఎవరంటే..
సీనియర్ హీరోయిన్ అర్చన.. ఇప్పటి జనరేషన్ కు తెలియక పోవచ్చు కానీ తెలుగు సినిమాల్లో క్లాసికల్ గా నిలిచిన సినిమాల్లో నిరీక్షణ ఒకటి. ఈ క్లాసిక్ హిట్ సినిమా ఎన్ని సార్లు చూసిన బోరు కొట్టదు. అలాగే ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్. ముఖ్యంగా ఈ సినిమాలోని ఆకాశం ఏ నాటిదో అనురాగం ఆ నాటిదే సాంగ్ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా తర్వాత అర్చన చాలాకాలం సినిమాల్లో కనిపించలేదు. ఇప్పుడు ఆమె షష్టిపూర్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అర్చన మాట్లాడుతూ.. నిరీక్షణ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. నిరీక్షణ సినిమాలో గిరిజన యువతి పాత్రలో నటించింది. ఆ పాత్రలో నటించడం సాహసం అనే చెప్పాలి. అప్పట్లో నేను చీరకట్టుకొని బ్లౌజ్ లేకుండా నటిస్తున్నా అని తెలిసి అందరూ షాక్ అయ్యారు. నేను దర్శకుడిని నమ్మాను.. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో ఎక్కడా అశ్లీలత లేదు.. ఆయనను పూర్తిగా నమ్మి నేను ఆ సినిమా నటించా.. అని తెలిపారు అర్చన. నిరీక్షణ సినిమాకు బాలుమహేంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎవర్ గ్రీన్ హిట్ అయ్యింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.