Aparna Das: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. గుడిలో సింపుల్‏గా ప్రియుడితో ఏడడుగులు..

మలయాళీ ఇండస్ట్రీకి చెందిన అపర్ణా దాస్, దీపక్ పరమా కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇటీవలే నిశ్చితార్థ వేడుక అనంతరం తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ఈ ప్రేమపక్షులు.. ఇప్పుడు పెళ్లి వేడుకతో ఒక్కటయ్యారు. అపర్ణా దాస్ తెలుగులో ఆదికేశవ చిత్రంలో నటించింది. యంగ్ హీరో వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన ఈసినిమాలో అపర్ణా దాస్ కీలకపాత్రలో కనిపించింది.

Aparna Das: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. గుడిలో సింపుల్‏గా ప్రియుడితో ఏడడుగులు..
Aparna Das, Deepak Parambol
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 24, 2024 | 9:36 AM

టాలీవుడ్ హీరోయిన్ అపర్ణా దాస్ పెళ్లి పీటలెక్కింది. తన ప్రియుడు నటుడు దీపక్ పరమాతో కలిసి గుడిలో ఏడడుగులు వేసింది. పెళ్లికి ముందు హల్దీ వేడుక, సంగీత్ ఫంక్షన్ ఎంతో గ్రాండ్ గా చేసుకున్న ఈ జంట.. పెళ్లి మాత్రం సంప్రదాయ పద్దతిలో వడకంచెరిలోని ఓ గుడిలో ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా చేసుకున్నారు. వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మలయాళీ ఇండస్ట్రీకి చెందిన అపర్ణా దాస్, దీపక్ పరమా కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇటీవలే నిశ్చితార్థ వేడుక అనంతరం తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ఈ ప్రేమపక్షులు.. ఇప్పుడు పెళ్లి వేడుకతో ఒక్కటయ్యారు. అపర్ణా దాస్ తెలుగులో ఆదికేశవ చిత్రంలో నటించింది. యంగ్ హీరో వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన ఈసినిమాలో అపర్ణా దాస్ కీలకపాత్రలో కనిపించింది.

నాన్ ప్రకాశ్ సినిమాతో మలయాళీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అపర్ణా దాస్. ఆ తర్వాత పలు చిత్రాల్లో కనిపించి అలరించింది. ఇక నటుడు దీపక్ పరమా మలర్వాడి అర్ట్స్ క్లబ్ సినిమాతో రంగ ప్రవేశం చేసాడు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించిన అతడు.. ఇటీవల బాక్సాఫీస్ సంచలనం మంజుమ్మెల్ బాయ్స్ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం హీరోగా వరశం పరి సినిమాలో నటిస్తున్నాడు.

దీపక్, అపర్ణా ఇద్దరు కలిసి మనోహరం సినిమాలో నటించారు. అదే సమయంలో వీరిద్దరి లవ్ స్టోరీ స్టార్ట్ అయినట్లుగా తెలుస్తోంది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఈరోజు (ఏప్రిల్ 24న) బుధవారం తెల్లవారుజామున గురువాయూర్ ఆలయంలో వీరి వివాహం అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరిగింది.

View this post on Instagram

A post shared by Siju Wilson (@siju_wilson)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.