Anupama Parameswaran: లైఫ్ చాలా చిన్నది.. చావు ఎప్పుడొస్తుందో చెప్పలేం.. అనుపమ ఆసక్తికర కామెంట్స్

తెలుగుతోపాటు.. తమిళం, మలయాళంలోనూ అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఈ ఏడాది కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత 18 పేజీస్ చిత్రంలో నటించింది.

Anupama Parameswaran: లైఫ్ చాలా చిన్నది.. చావు ఎప్పుడొస్తుందో చెప్పలేం.. అనుపమ ఆసక్తికర కామెంట్స్
Anupama Parameswaran

Updated on: Jun 04, 2023 | 10:03 AM

సౌత్ ఇండస్ట్రీలో అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కేరళ కుట్టికి తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగుతోపాటు.. తమిళం, మలయాళంలోనూ అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఈ ఏడాది కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత 18 పేజీస్ చిత్రంలో నటించింది. ఈ మూవీస్ తర్వాత అనుపమ నుంచి మరో ప్రాజెక్ట్ అనౌన్మెంట్ రాలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ మలయాళీ బ్యూటీ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది.

అనుపమకు ఇన్‌స్టాగ్రామ్‌లో 13 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఈ అమ్మడు ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎక్స్‌ప్రెషన్స్ పలికించడంలో మీరు ఎలా ఆలోచిస్తారు.? అని ప్రశ్నించగా ఆమె ఇలా స్పందించారు.

ఎక్స్‌ప్రెషన్స్ వ్యక్తపరిచే విషయంలో నేను చాలా నిజయితీగా ఉంటా. ఒకవేళ నాకు నచ్చకపోతే మొహం మీద చెప్పేస్తా అని తెలిపింది. అలాగే ఆ విషయాన్ని పట్టించుకోకుండా.. అక్కడే వదిలేస్తా. దాని గురించి ఎక్కువగా ఆలోచించను.  ఎందుకంటే మన లైఫ్ చాలా చిన్నది. ఇక్కడ మనం కొంతకాలం ఉండడానికి మాత్రమే వచ్చాం.. మళ్లీ వెళ్లిపోతాం. ఆ రోజు ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. బతికి ఉన్న కొద్ది రోజులైనా మన ఒత్తిడి దాచుకోవడానికి మన శక్తిని ఎందుకు అనవసరంగా వేస్ట్ చేయాలి అని తెలిపింది. సీసీ టీవీ పుటేజ్‌ నెల రోజుల తర్వాత ఆటోమెటిక్‌గా డిలీట్‌ అయినట్లు.. నా మైండ్ లోని చెత్తను డిలీట్ చేస్తుంటా అని చెప్పుకొచ్చింది అనుపమ.