నేను సినిమాలకు గుడ్ బై చెప్పలేదు.. సరైన ప్రాజెక్ట్ కోసం చూస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన క్రేజీ బ్యూటీ

సినిమా రంగంలో ప్రస్తుతం అగ్ర నటీమణులుగా వెలుగొందుతున్న కొందరు ఒకప్పుడు బాలనటులుగా తమ ప్రస్థానాన్ని ప్రారంభించారంటే చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు. చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తున్నారు .

నేను సినిమాలకు గుడ్ బై చెప్పలేదు.. సరైన ప్రాజెక్ట్ కోసం చూస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన క్రేజీ బ్యూటీ
Actress

Updated on: Sep 18, 2026 | 4:32 PM

సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లు కొంతకాలం పాటు కొత్త సినిమాల్లో కనిపించకపోతే.. వారు సినిమాలకు దూరమవుతున్నారంటూ వార్తలు రావడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఇలాంటి ప్రచారాలు మరింత వేగంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ విషయంలోనూ ఇదే జరిగింది. కొంతకాలంగా ఆమె కొత్త సినిమాల్లో కనిపించకపోవడంతో నటనకు గుడ్‌బై చెప్పబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. అయితే ఈ వార్తలకు అను ఇమ్మాన్యుయేల్ స్వయంగా చెక్ పెట్టారు. తాను సినిమాలకు దూరం కాలేదని, నటనను వదిలే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తనకు నచ్చే కథలు, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల కోసం ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది అను ఇమ్మాన్యుయేల్.

Aditi Myakal : మేడమ్ సార్ మేడమ్ అంతే..! మెంటలెక్కిస్తున్న అర్జున్ రెడ్డి భామ

తన గురించి జరుగుతున్న ప్రచారంపై అను ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. తాను నటనకు దూరమవుతున్నాననే వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. తాను ఎప్పుడూ సినిమాలను వదిలేస్తున్నానని చెప్పలేదని, భవిష్యత్తులోనూ అలా చేసే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చింది అను. రొటీన్ గ్లామర్ పాత్రలు మాత్రమే చేయకుండా, తనలోని నటనా ప్రతిభను చూపించే మంచి కథల కోసం చూస్తున్నట్లు ఆమె తెలిపింది. సరైన ప్రాజెక్ట్ దొరికిన వెంటనే తన కొత్త సినిమాల వివరాలను స్వయంగా ప్రకటిస్తానని చెప్పుకొచ్చింది అను ఇమ్మాన్యుయేల్.

ఇవి కూడా చదవండి

ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.. కట్ చేస్తే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది

దీంతో ఇన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లైంది. అను ఇమ్మాన్యుయేల్ సినిమాలకు దూరం కావడం లేదని తెలియడంతో ఆమె అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్ మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘మజ్ను’ సినిమాతో 2016లో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే తన అందం, చలాకీతనం, సహజమైన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆతర్వాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో ఛాన్స్ అందుకుంది. కానీ సరైన హిట్స్ లేకపోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

అప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. కట్ చేస్తే మాజీ సీఎం భార్య.. ఇద్దరి మధ్య 27ఏళ్ల ఏజ్ గ్యాప్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us