
సోషల్ మీడియాలో సినీతారలు చేసే సందడి గురించి చెప్పక్కర్లేదు. తమ సినిమా అప్డేట్స్, ప్రతిరోజూ ఏదోక గ్లామరస్ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంటారు. అలాగే తమ పర్సనల్ విషయాలు సైతం పంచుకుంటారు. తాజాగా ఓ హీరోయిన్ తన మసాజ్ వీడియోతోపాటు అందుకు సంబంధించిన ఖర్చును సైతం ఇప్పుడు అదే విషయం నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది. ఆమె పేరు అంజు కురియన్. మలయాళీ, తమిల చిత్రాలలో తన నటనతో అపారమైన అభిమానాన్ని సంపాదించుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచింది. అల్ఫోన్స్ పుతిరన్ దర్శకత్వంలో, నివిన్ పౌలీ ప్రధాన పాత్రలో నటించిన ‘నేరం’ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది అంజు. ఈ చిత్రం 2013లో థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం మలయాళం, తమిళం రెండు భాషలలో ఏకకాలంలో విడుదలైంది.
ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఆమె గొప్ప నటి.. ఆమె టాలెంట్ స్వయంగా చూశా.. కానీ సక్సెస్ కాలేకపోయింది.. కారణం ఇదే.. డైరెక్టర్ కృష్ణవంశీ..
అంజు కురియన్ ‘ఓం శాంతి ఓసానా’ చిత్రంలో నటించింది, ఇది నజ్రియా నటించిన విడుదలతో దృష్టిని ఆకర్షించింది. అంజు కురియన్ 2015లో అల్ఫోన్స్ పుతిరన్ రెండవ చిత్రం ‘ప్రేమమ్’లో కూడా నటించారు. 2017లో వచ్చిన ‘చెన్నై టు సింగపూర్’ చిత్రంతో తమిళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో ఇదం జగత్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న అంజు.. తాజాగా బాలి ద్వీపానికి వెకేషన్ కోసం వెళ్లింది.
ఎక్కువ మంది చదివినవి : Raviteja : జీవితంలో ఆయనను మర్చిపోలేను.. నన్ను మరో స్థాయికి తీసుకెళ్లాడు.. రవితేజ..
అయితే బాలిలో ఆమె చేయించుకున్న ఖరీదైన స్పా మసాజ్ గురించి ఓ వీడియోను ఇన్ స్టాలో పంచుకుంది. జపాన్ లో అత్యంత ఖరీదైన స్పా మసాజ్ అంటూ దాని బిల్లును పంచుకుంది. అందులో ఆమె చెప్పినట్లు ఆ మసాజ్ ధర రూ.7.25 లక్షలు. బాలిలో అంత పెద్ద మొత్తంలో డబ్బు కేవలం 4k అని రాసుకొచ్చింది. ప్రస్తుతం అంజు షేర్ చేసిన వీడియోతోపాటు ఆ బిల్లు చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Babloo Prithiveeraj : హీరో కంటే బాగా చేశానని ఆ సినిమాలో నా సీన్స్ తీసేశారు.. దెబ్బకు సినిమా రిజల్ట్ మారిపోయింది.. నటుడు పృథ్వీరాజ్..
ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy : 25 ఏళ్లుగా ఆ ఒక్కటి తినడం మానేసా.. 56 ఏళ్ల వయసులో నా హెల్త్ సీక్రెట్ ఇదే.. జేడీ చక్రవర్తి కామెంట్స్..