పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరుకు ఉండే స్థాయి, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ పేరు మార్మోగిపోతోంది. ఎన్డీఏ కూటమి విజయం సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అందుకు తగ్గట్టుగానే ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో పవన్ కల్యాణ్ కు ఉన్న కోట్లాది మంది అభిమానులు ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు కూడా పవన్ విజయాన్ని స్వాగతిస్తున్నారు. ఆయనకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా పవర్ స్టార్ పవన కల్యాణ్ ను అమితంగా ఆరాధించే టాలీవుడ్ సెలబ్రిటీల్లో ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి చొక్కారపు ఒకరు. ఎంతలా అంటే తన కుమారుడికి అకీరా నందన్ అని పేరు పెట్టేంత. అలాగే ఆమె రన్ చేస్తోన్న బోటిక్ పేరు కూడా పవన్ కళ్యాణ్ కుమారుడు పేరు వచ్చేట్టుగా అకీరా లేబిల్ అనే పేరు పెట్టింది స్రవంతి.
“నేను పవన్ కల్యాణ్‌కు మొదటి నుంచి చాలా పెద్ద అభిమానిని. అందుకే మా అబ్బాయికి పవన్ కుమారుడి పేరు అయిన అకీరా నందన్ అని పేరు పెట్టాను. ఇన నేను సొంతంగా నడిపే బోటిక్ పేరు కూడా అకీరా లేబిల్. నా బోటిక నుంచి పవన్ కల్యాణ్ కు కొన్ని అవుట్ ఫిట్స్ కూడా పంపించాను. అవి ఆయన వేసుకున్నారు కూడా. అందుకు నేను చాలా హ్యాఫీగ ఫీలయ్యాను’ అని స్రవంతి చెప్పుకొచ్చింది.
Sravanthi Chokarapu (Credit: Sravanthi Chokarapu Instagram)
ఇదిలా ఉంటే స్రవంతి ఇంతవరకు నేరుగా పవన్ కల్యాణ్ ని కలవలేదట. అయితే త్వరలోనే ఆయనను కలుస్తానని ధీమాగా చెబుతోందీ అందాల యాంకరమ్మ. ‘ పవన్ కల్యాణ్ గత కొంత కాలంగా ప్రచార సభలు, ఎన్నికలు, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా, మంత్రిగ బిజీ బిజీగా ఉంటున్నారు. వీటినుంచి ఆయనకు కాస్త తీరిక సమయం దొరికినప్పుడు కచ్చితంగా కలుస్తాను’ అని చెప్పుకొచ్చింది స్రవంతి. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసి మెగాభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.