
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. విశ్వంభర, మన శంకరవరప్రసాద్ గారు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారిన తార.. చిరుతో మాత్రం ఒక్క సినిమా చేయలేదు. తన కెరీర్ లో చిరుతో నటించే అవకాశాన్ని కోల్పోవడం తన జీవితంలో కోల్పోయిన పెద్ద ఛాన్స్ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆమె మరెవరో కాదు.. సీనియర్ హీరోయిన్ ఆమని. 90వ దశకంలో టాలీవుడ్‌లో హోమ్లీ ఇమేజ్‌తో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మావి చిగురు, శుభలగ్నం, జంబలకిడి పంబ వంటి చిత్రాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన కెరీర్ లో స్టార్ హీరోలతో నటించిన ఆమని.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. సినిమాలతోపాటు సీరియల్స్ సైతం చేస్తూ బిజీగా ఉంటున్నారు. అయితే చిరుతో తనకు ఛాన్స్ వచ్చినప్పటికీ సినిమా చేయలేకపోయానని అంటున్నారు.
ఇవి కూడా చదవండి : Ranu Bombaiki Ranu Song : యూట్యూబ్ సెన్సేషన్.. రానూ బొంబాయికి రాను పాటకు ఎంత అమౌంట్ ఇచ్చారంటే.. డ్యాన్సర్ లిఖిత కామెంట్స్..
ఓ ఇంటర్వ్యూలో ఆమని మాట్లాడుతూ.. శుభలగ్నం, మిస్టర్ పెళ్లాం వంటి అనేక వైవిధ్యభరితమైన పాత్రలు పోషించినందుకు గర్వపడుతున్నానని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించలేకపోవడం తన కెరీర్‌లో ఒక తీరని లోటుగా మిగిలిందని… చిన్నతనం నుండి చిరంజీవికి వీరాభిమానినైన తాను, ఆయన పక్కన హీరోయిన్‌గా నటించాలని కలలు కనేదాన్నని చెప్పారు. శుభలగ్నం తర్వాత చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన రిక్షావోడు చిత్రంలో తనకు కథానాయికగా అవకాశం వచ్చిందని, డేట్స్ కూడా ఖరారు అయ్యాయని అన్నారు. షూటింగ్‌కు కొన్ని రోజుల ముందు చిరంజీవితో మాట్లాడడం కూడా జరిగిందని ఆమె తెలిపారు. అయితే, డైరెక్టర్ కోదండరామిరెడ్డి స్థానంలో కోడి రామకృష్ణ వచ్చిన కారణంగా తన స్థానంలోకి నగ్మాను తీసుకున్నారని ఓ వార్త చదివానని తెలిపారు. ఈ సంఘటన తనకు తీవ్ర నిరాశను కలిగించిందని, చిరంజీవితో సినిమా చేయలేకపోవడం జీవితాంతం వెంటాడుతుందని అన్నారు.
శుభలగ్నం చిత్రం తర్వాత వచ్చింది. చిరంజీవి నటించిన రిక్షావోడు చిత్రానికి తనను మొదట కథానాయికగా సంప్రదించారని, డేట్స్ కూడా తీసుకున్నారని ఆమె వెల్లడించారు. షూటింగ్‌కు సుమారు 15 రోజులు ఉండగా చిరంజీవితో మాట్లాడానని, ఆ సినిమాలో భాగమైన సౌందర్య కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పారు. అయితే, ఆ తర్వాత వారం, పదిహేను రోజుల్లో ఏం జరిగిందో తెలియదని, పత్రికల్లో నగ్మా ఫోటో చూసి ఆశ్చర్యపోయానని ఆమని వివరించారు. మేనేజర్ ద్వారా విషయం తెలుసుకున్నానని, డైరెక్టర్ మారడం (కోదండరామిరెడ్డి స్థానంలో కోడి రామకృష్ణ) వల్లే తాను తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఈ సంఘటన తనకు తీవ్ర నిరాశను కలిగించిందని, చిరంజీవి సినిమాలో అవకాశం కోల్పోయినందుకు తాను చాలాసార్లు బాధపడ్డానని ఆమె పేర్కొన్నారు. ఆ బాధ జీవితాంతం మిగిలిపోతుందని ఆమె తెలిపారు.
Chiranjeevi, Aamani
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..