AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tabaahi Song : బాబోయ్.. ఇదెక్కడి రొమాన్స్ రా బాబూ.. టాక్సిక్ నుంచి తబాహీ సాంగ్ రిలీజ్.. పెద్దలకు మాత్రమే..

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ సినిమాలకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఒక సాధారణ బస్ డ్రైవర్ కొడుకు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం యశ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ టాక్సిక్. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజ్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్..

Tabaahi Song : బాబోయ్.. ఇదెక్కడి రొమాన్స్ రా బాబూ.. టాక్సిక్ నుంచి తబాహీ సాంగ్ రిలీజ్.. పెద్దలకు మాత్రమే..
Tabaahi Song
Rajitha Chanti
|

Updated on: Jul 08, 2026 | 4:04 PM

Share

కేజీఎఫ్’ చిత్రాలతో దేశవ్యాప్తంగా అపారమైన క్రేజ్ సొంతం చేసుకున్న కన్నడ రాకింగ్ స్టార్ యశ్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ 1, 2 చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ఆయన.. ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తదుపరి చిత్రం ‘టాక్సిక్’ (Toxic: A Fairy Tale for Grown-Ups). ఈ మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇదివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశారు. వైవిధ్యభరితమైన చిత్రాల దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు ఈ సినిమా చాలా రా అండ్ రస్టిక్‌గా, బోల్డ్ కంటెంట్‌తో ఉండబోతోందని స్పష్టం చేశాయి. మరోవైపు ఇటీవల విడుదలైన టీజర్ పై అటు విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ‘తబాహి’ (Tabaahi) అనే మొదటి వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఈ పాటలో రాకింగ్ స్టార్ యశ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మధ్య కెమిస్ట్రీ మునుపెన్నడూ చూడని విధంగా, ఫుల్ బోల్డ్‌గా ఉంది. వీరిద్దరి రొమాన్స్ ఈ సాంగ్‌లో పీక్స్‌కు చేరిందని చెప్పవచ్చు. వింటేజ్ కార్ల బ్యాక్‌డ్రాప్, బీచ్, రెట్రో స్ట్రీట్స్ , వర్షంలో సాగే సీన్లు.. ఇలా ప్రతి ఫ్రేమ్‌లోనూ యశ్, కియారాల మధ్య ముద్దులు, కౌగిలింతలతో రొమాన్స్ ఒక రేంజ్‌లో చూపించారు. ఈ పాటను కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేశారు. ఈ పాటకు విశాల్ మిశ్రా స్వరాలు సమకూర్చడమే కాకుండా స్వయంగా ఆలపించారు. తెలుగులో ఈ రొమాంటిక్ మెలోడీకి ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. సాంప్రదాయ ప్రేమకథలా కాకుండా, విధ్వంసకరమైన, తీవ్రమైన ఇంటెన్సిటీ కలిగిన ప్రేమను ఈ పాటలో చూపించినట్లు సంగీత దర్శకుడు తెలిపారు. 13వ శతాబ్దపు పర్షియన్ కవి రూమి రాసిన ఒక అందమైన కొటేషన్‌తో ఈ వీడియో సాంగ్ ప్రారంభం కావడం విశేషం.

ఇక ఈ సినిమాలో కేవలం రొమాన్స్ మాత్రమే కాకుండా భారీ యాక్షన్, గ్యాంగ్‌స్టర్ డ్రామా కూడా ఉండబోతోంది. చిత్రంలో యశ్, కియారా అద్వానీలతో పాటు నయనతార, తారా సుతారియా, హుమా ఖురేషి వంటి స్టార్ హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం, ఎట్టకేలకు ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న ఈ ‘తబాహి’ సాంగ్, టాక్సిక్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: అన్నయ్య నాకోసం ఫ్యాన్స్ వస్తారా అని అడిగాడు.. ఇప్పుడు ఇండస్ట్రీకే మొగుడయ్యాడు.. మురళి మోహన్..

తబాహీ సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : Cinema: ఫస్ట్ సినిమా చూసి ప్లాప్ అన్నారు.. కట్ చేస్తే.. 26 ఏళ్లుగా తగ్గని క్రేజ్.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతారు..

Follow Us
'కోచింగ్ లేకుండా సివిల్స్ సాధ్యమే.. ఈ బుక్స్ చదవండి' UPSC టాపర్
'కోచింగ్ లేకుండా సివిల్స్ సాధ్యమే.. ఈ బుక్స్ చదవండి' UPSC టాపర్
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర